డబ్బు ఇవ్వలేదని చుక్కలు చూపించిన హీరోయిన్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ మధురిమ వ్యవహారం ఓ తమిళ సినిమా విషయంలో వివాదాస్పదం అయింది. ప్రస్తుతం ఆమె 'సెరెందు పోలమ' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగింది. షూటింగ్ సమయంలో మధురిమ వ్యవహరించిన తీరుపై దర్శకుడు ఫైర్ అయ్యారు.

ఈ విషయమై దర్శకుడు అనిల్ మీడియతో మాట్లాడుతూ....న్యూజిలాండ్ లో షూటింగ్ సమయంలో మధురిమ ఇబ్బందులకు గురి చేసిందని, సమయానికి షూటింగుకు హాజరయ్యేది కాదని, ఆమె కోసం తాము చాలా సార్లు వేయిట్ చేయాల్సి వచ్చిందని, దీని కారణంగా తమ సమయం, డబ్బు వృధా అయ్యాయని ఆరోపించారు. ఆమె నిర్లక్ష్యం కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని, ఈ విషయాలను ఆమెకు తెలిపినా పట్టనట్లు వ్యవహరిస్తోందని మండి పడ్డారు.

అయితే మధురిమ వాదన మరోలా ఉంది. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. 'దర్శక నిర్మాతలు తనకు ఇప్పటి రెమ్యూనరేషన్లో అడ్వాన్స్‌గా ఇవ్వాల్సిన 10 శాతం పేమెంట్ కూడా చేయలేదని, తల్లిదండ్రుల తోడు లేకుండా నేను విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. నిర్మాతల వల్లనే నా పేరెంట్స్ విసా అప్లికేషన్ ఆగిపోయింది. ఇదే విషయాలపై నేను నిర్మాతతో వాదిస్తూ......నాది అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ అంటూ నాపై నిందలు వేస్తున్నారు' అని మధురిమ ఆరోపిస్తోంది.

మధురిమ తెలుగు సినిమాల విషయానికొస్తే...త్వరలో ఆమె మారుతి దర్శకత్వంలో కొత్తజంట చిత్రంలో నటించబోతోంది. మధురిమకు సంబంధించిన ఇతర వివరాలు స్లైడ్ షోలో...

మధురిమ

మధురిమ

మధురిమ పూర్తి పేరు మధురిమ బెజనర్జీ. 1987 మే 14న ముంబైలో జన్మించింది. హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిర్, గజల్‌తో పాటు కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకున్న మధురిమ టీవీ సీరియల్ష్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టింది. కొన్ని టీవీ ఛానల్స్‌లో యాంకర్‌‌గా పార్ట్ టైం జాబ్ చేసింది.

సినిమాల్లోకి..

సినిమాల్లోకి..

పలు టీవీ సీరియళ్లలో నటించిన అనంతరం ‘టాస్ : ఎ ప్లిప్ ఆఫ్ డెస్టినీ' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసిన మధురిమ....ఆ వెంటనే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ హీరోగా పరియమైన ‘ఆ ఒక్కడు' చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో నటించిన సినిమాలు

తెలుగులో నటించిన సినిమాలు

మధురిమ ఇప్పటి వరకు పలు తెలుగు సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ ఒక్కడు, మౌన రాగం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో చిత్రాల్లో మధురిమ నటించింది.

హిందీలో...

హిందీలో...

టాస్ అనే హిందీ చిత్రంతో 2009లో తన సినీ కెరీర్ ప్రారంభించిన మధురిమ...పలు తెలుగు సినిమాల్లో నటించిన అనంతరం 2012లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘కమాల్ ధమాల్ మాలామాల్' అనే చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్ మనడంతో మధురిమ బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.

కుటుంబ నేపథ్యం

కుటుంబ నేపథ్యం

మధురిమ తండ్రి ఇండియన్ నేవీలో మెకానికల్ ఇంజనీర్‌గా సేవలు అందించారు. ఆమె తల్లి వైరాలజీలో రీసెర్చ్ విభాగంలో, కంటెంట్ రైటర్‌గా పని చేసి నావెలిస్టుగా మారారు.

మధురిమ

మధురిమ


మధురిమ న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. చదువు పూర్తయిన వెంటనే సినిమా రంగం వైపు దృష్టి సారించింది. ఆమెకు తనకంటే నాలుగేళ్లు చిన్నవాడైన సోదరుడు ఉన్నారు.

సంగీతం, డాన్స్

సంగీతం, డాన్స్


మధురిమకు చినతనం నుండి సంగీతం, డాన్స్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తి కారణంగానే తన తల్లి నుంచి ఆమె హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు, గజల్‌ నేర్చుకుంది. ఆ తర్వాత కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది కానీ....తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా మధ్యలోనే ఆపేసింది.

హాట్ ఫోటో షూట్లు

హాట్ ఫోటో షూట్లు

సినిమా అవకాశాలు పెద్దగా లేక పోయినా....తన ఉనికిని కాపాడుకోవడానికి హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో లైమ్ లైట్లో ఉండే ప్రయత్నం చేస్తోంది మధురిమ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X