'హాట్' గా కనపడటానికి మధురిమ ఫ్రీ టిప్స్...
బికినీ, మినీ, స్కర్ట్ ఇలాంటి దుస్తుల్లోనే హాట్‌గా కనిపించొచ్చు అని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఆ విషయాన్ని నేనస్సలు ఒప్పుకోను. సల్వార్, చీర..ఇలా నిండైన వస్త్రాల్లోనూ చిలిపిగా కనిపించొచ్చు. నేను చేసిన మూడు సినిమాల్లోనూ నేను చీరే ఎక్కువసార్లు కట్టుకున్నాను. అందులోనూ అందంగానే ఉన్నాను కదా! బికినీలో కన్నా చీరలోనే కనికట్టు ఉంది. అంటూ హాట్ గా కనపడటానికి టిప్స్ చెప్పుకొచ్చింది... సరదాగా కాసేపు చిత్రలో చేసిన మధురిమ ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలాగే తాను చేసిన మూడు చిత్రాల గురించి చెబుతూ..ఆ ఒక్కడు', 'మౌనరాగం'..ఈ సినిమాల్లో నాకు లభించినవి మంచి పాత్రలే. వాటిని చేయాలంటే ఎంతో అనుభవం కావాలి. 'మౌనరాగం' చూసినవాళ్లంతా 'సౌందర్య చేయవల్సిన పాత్ర అది.. నీకు దక్కింది' అన్నారు. 'సరదాగా కాసేపు'లో పద్ధతైన పాత్ర. వినోదం పండించే అవకాశం దక్కింది. ఎటువంటి పాత్ర అయినా చేయగలను అనే నమ్మకం నాకు ఈ మూడు సినిమాలూ ఇచ్చాయి అంది. ప్రస్తుతం ఈ బెంగాళి భామ..రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ లో ఓ పాట చేసింది.


Click it and Unblock the Notifications











