వంశీ కొత్త చిత్రంలో హీరోయిన్ ఆమే
వంశీ చిత్రాల్లో హీరోయిన్స్ ని ప్రత్యేకంగా చూపుతారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చిత్రంలో హీరోయిన్ గా మధురిమ అవకాశం సంఫాదించింది. అల్లరి నరేష్ హీరోగా రూపొందే ఈ చిత్రం ఈ వారంలోనే లాంఛనంగా చిత్రీకరణ మొదలవుతుంది. అజయ్ హీరోగా వచ్చిన సినిమా 'ఆ ఒక్కడు' చిత్రంలో హీరోయిన్ గా మధురిమ పరిచయమైంది. డాక్టర్ పవిత్ర పాత్రలో రాణించిన మధురిమకు వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. మొన్న రిలీజైన మౌనరాగం చిత్రంలో ఆమె తనీష్ సరసన చేసింది. ఇక ఎమ్మెల్ పద్మకుమార్ చౌదరి నిర్మాతగా నిర్మించే ఈ కొత్త చిత్రానికి 'సరదాగా కాసేపు' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.
ఇంతకుముందు అల్లరి నరేష్ తో లేడీస్ టైలర్ సీక్వెల్ వంశీ చేయనున్నారని వినిపించింది. అయితే ఇప్పుడా కథ కాకుండా వేరే కథలో ఆయన రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ మరో ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో రానున్న సుమధురం చిత్రంలో చేస్తున్నారు. మంజరి ఫెర్నాండెస్ ఈ చిత్రంలో నరేష్ కి జోడీగా చేస్తోంది. అలాగే ఈ చిత్రం అనంతరం ముళ్ళపూడి వీరభద్ర చౌదరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందనున్న చిత్రం ప్రారంభమవుతుంది. నమో వెంకటేశ, బిందాస్ చిత్రాలు నిర్మించిన అనీల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత వంశీ చిత్రం అనంతరం...రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసే చిత్రం మొదలవుతోంది.


Click it and Unblock the Notifications











