»   »  మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై నిషేధం

మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై నిషేధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ఎంఎస్‌జీ2- మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమాపై మధ్యప్రదేశ్‌లో నిషేధం విధించారు. దేవుడి సందేశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం కొన్ని వర్గాలను అవమానించేకరంగా ఉందనే ఆరోపణలతో పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ఆ సినిమాను అనధికారికంగా నిలిపివేశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఈ చిత్రాన్ని నిషేధించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

గతంలో...

డేరా సచ్ఛా సౌధ అధ్యక్షుడు రామ్‌రహీమ్‌ సింగ్‌ నటించి, సంగీతాన్ని సమకూర్చి, దర్శకత్వం కూడా చేసిన చిత్రం ‘మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌'. పలు అవాంతరాలను దాటుకుని ఈ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఈ చిత్రం సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ పలుచోట్ల నిరసనలు వ్యక్తం కావడంతో సినిమా విడుదలను ఆపేశారు.

 Madhya Pradesh government bans 'MSG 2'

ఈ సినిమాలో రామ్‌ రహీమ్‌సింగ్‌ వేషధారణ 17వ శతాబ్దానికి చెందిన సిక్కుగురువును తలపించేలా ఉందని సిక్కులు భావిస్తున్నారు. బంగారు ఆభరణాలను ధరించిన గురువు బైకులను నడపడం వంటి వాటికి సర్వత్రా అభ్యంతరం వ్యక్తమైంది. ఇతరులు తప్పు పట్టడానికి ఏమీ లేదనీ, డ్రగ్‌ అడిక్షన్‌ను, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూనే ఈ సినిమా చేశామని రూపకర్తలు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ బోర్డు చెయిర్‌ పర్సన్‌ లీలా శామ్సన్‌ విడుదలకు అనుమతించలేదు.

చివరికి చిత్ర యూనిట్‌ సభ్యులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి అనుమతి పొందారు. సెన్సార్‌ విషయంలో ప్రభుత్వాధికారుల జోక్యం ఎక్కువైందని, బలవంతం చేస్తున్నారని, అధికారులు డబ్బుకు అమ్ముడు పోతున్నారని ఆరోపిస్తూ లీలా శామ్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

దీని గురించి సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోర్‌ మాట్లాడుతూ ‘‘సెన్సార్‌ విషయంలో మేమెప్పుడూ జోక్యం చేసుకోం. సెన్సార్‌కు ఓ అడుగు దూరంగానే ఉంటాం. ‘మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌' చిత్ర రూపకర్తలు రివైజింగ్‌ కమిటీని ఆశ్రయించారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్‌ జడ్జి అధ్యక్షత వహిస్తారు. సుప్రీమ్‌ కోర్టు న్యాయవాది, సీనియర్‌ జర్నలిస్ట్‌ కూడా ట్రిబ్యునల్‌లో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాధికారులు అక్కడ చేయడానికి ఏమీ ఉండదన్న విషయాన్ని గ్రహించాలి. ఎవరో బలవంతం చేస్తున్నారని లీలా ఆరోపించారు.

ఆమెకి గానీ, మిగిలిన సభ్యులకుగానీ అలాంటి ఎస్సెమ్మెస్‌లుగానీ, లెటర్లుగానీ వచ్చుంటే మాకు చూపించాలి. ఇతరుల జోక్యం గురించి, బలవంతం చేసిన వారి గురించి నిర్ధిష్టమైన ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లీలా రాజీనామాకు సంబంధించి మాకు ఇంతవరకు ఎలాంటి లేఖ అందలేదు. టీవీల్లో చూసి తెలుసుకున్నాం. ఏడాదిలో ఒకటీ రెండు సార్లు మాత్రమే ఆమె కార్యాలయానికి వచ్చినట్టు కూడా ఆమెతో పనిచేసిన వారు చెబుతున్నారు'' అని అన్నారు.

లీలా శామ్సన్‌కు మద్ధతుగా మరో సభ్యురాలు కూడా రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉంటే రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఇందులో ఎవరూ వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఈ చిత్రంలో నన్ను నేను దేవుడిగా ఎక్కడా ప్రదర్శించుకోలేదు. కనీసం ‘నేను దేవుడిని' అనే మాటను కూడా వాడలేదు. అలాంటప్పుడు ప్రీమియర్‌ను ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదు. సినిమాను వ్యతిరేకించేవారు ముందు సినిమాను చూడండి. తర్వాత మాట్లాడండి'' అని చెప్పారు.

English summary
Madhya Pradesh on Friday became the third state to ban screening the film Messenger of God 2. Last week Chattisgarh and Jharkhand had banned the film calling it as an 'ínsult to tribals'.
Please Wait while comments are loading...