జాతీయ అవార్డుకు నామినేట్ అయిన ‘మద్రాస్ కేఫ్’
హైదరాబాద్: జాన్ అబ్రహం, నర్గీష్ ఫక్రి ప్రధాన పాత్రలో సూచిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్' చిత్రం జాతీయ అవార్డుకు నామినేట్ అయింది. శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి ఎల్‌టీటీఈకి మధ్య జరిగిన సివిల్ వార్, రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం ఆగస్టు 23, 2013న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిణామాలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
తాజాగా ఈచిత్రం జాతీయ అవార్డుకు నామినేట్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మరి జాతీయ అవార్డు రేసులో ఉన్న ఇతర సినిమాల పోటీని తట్టుకుని అవార్డును దక్కించుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది ఈ అవార్డుల ప్రధానం జరుగనుంది.

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ బిజినెస్ చేసినప్పటికీ...చాలా మంది సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో జాన్ అబ్రహం ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‍గా, 'రా' ఏజెంటుగా కనిపించారు. శ్రీలంకలో జరిగే పరిణామాలను బయటి ప్రపంచానికి తెలియజేసే విదేశీ జర్నలిస్టుగా నర్గీస్ ఫక్రి నటించింది.
ఈ సినిమా గురించి జాన్ అబ్రహం మాట్లాడుతూ...'ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో జరిగిన మార్పులకి దగ్గరగా ఉంటుంది' అన్నారు. దర్శకుడు సూజిత్ సర్కార్ మాట్లాడుతూ...'ఈ సినిమా వర్క్ ఆఫ్ ఫిక్షన్, కానీ ఈ చిత్ర కథ రియల్‌గా జరిగి సంఘటనలపై రీసెర్చ్ చేసి తయారు చేసాం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











