twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డు అనుమతిచ్చాక అడ్డుకోవడం కుదరదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఏ సినిమాకైనా చట్టబద్దమైన సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత అడ్డుకోవడం కుదరదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత ఆ సినిమాలోని సంబాషణలు, ఇతరత్రా అంశాలపై కొంత మంది అభ్యంతరాలను వ్యక్తం చేయడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టింది.

    ఇటీవల విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘కత్తి' సినిమా విషయంలో ఇదే జరిగింది. కొంత మంది సినిమాను అడ్డుకుంటున్నారంటూ నిర్మాతలు కోర్టు కెక్కారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన జస్టిస్ వి.రామసుబ్రమణియన్ సినిమాలో మనకు నచ్చని డైలాగులు, అభ్యంతరకర సన్నివేశాలున్నాయనే కారణాలతో సినిమాను అడ్డుకోజాలమని స్పష్టం చేసారు.

    Madras HC Allows 'Kaththi' Producers to Have Name Exhibited on Prints

    కత్తి నిర్మాతల్లో ఒకరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షేకు సన్నఇమితులనే ఆరోపణలతో కొందరు ఈ చిత్రాన్ని అడ్డుకున్నారు. రెండు ప్రజాసంఘాలు తమకు అభ్యంతరమన్న సన్నివేశాలను తొలగించాలని కోరి, వాటిని తొలగించిన తర్వాత సినిమాను విడుదల చేసారు. దీనిపై న్యాయం స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    కత్తి సినిమా విషయానికొస్తే...
    విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం కత్తి దక్షిణాదిన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో 100 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంది. అతితక్కువ కాలంలో ఈ ఖ్యాతిని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం. .‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.

    English summary
    The Madras High Court said once a film certified for screening by the Censor Board no group, organisation or association can demand further censoring on the ground that something in the film hurts religious, communal, racial or linguistic sentiments of someone or the other. "The same may tantamount to the creation of the super-Censor Board," Justice V.Ramasubramnian said, allowing a petition filed by producers of the Tamil movie 'Kathi' starring Vijay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X