'గజనీ'పై నిషేధం ఎత్తివేత

చంద్రశేఖర్ తన పిటిషన్‌లో తమిళంలో వచ్చిన గజిని చెన్నై పంపిణీ హక్కులు, తెలుగు పునర్నిర్మాణ హక్కులు, శాటిలైట్ ఛానెల్ హక్కులు తప్ప చిత్రం కథ, డబ్బింగ్‌పై తనకే పూర్తి అధికారం ఉందని సవాల్ చేస్తూ పిటీషన్ ధాకలు చేసారు. దాంతో రీమేక్ హక్కులు లేకుండా నిర్మించిన హిందీ 'గజని'ని విడుదల చేయకూడదంటూ న్యాయమూర్తి పీఆర్ శివకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఆ చిత్ర వర్గాలు ద్రిగ్భాంతి చెందాయి. గీతా ఆర్ట్స్ అప్పీలు మేరకు ఈ కేసుపై బుధవారం మళ్లీ విచారణ జరిగింది. గనుంది. ముంబైలో కేబీసీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లేల కాపీరైట్‌ను తాము సొంతం చేసుకున్నామంటూ గీతాఆర్ట్స్‌పై బాంబే హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది శుక్రవారంకు వాయిదా పడింది.
మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మార్కెట్ జరిగిన అమీర్‌ఖాన్ తొలి చిత్రమిదని సినీ వర్గాల కథనం. డ్రిస్టిబ్యూషన్ హక్కులను బాలీవుడ్‌కు చెందిన ఎరోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇది తమిళంలో సూర్య కథానాయకుడిగా విడుదలైన 'గజని' రీమేక్ వర్షన్. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న గజనీ చిత్రం క్రిస్మస్ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి వుంది. ఇక ఈ గజనీ చిత్రం హాలీవుడ్ చిత్రం 'మొమెంటో' నుంచి ప్రేరణ పొందినది అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











