Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
కలర్స్ స్వాతి సినిమాపై కోర్టు నిషేదం
జై, కలర్స్ స్వాతి, షాజన్‌పదంసి ప్రధానపాత్రధారులుగా జెఎన్ఆర్ పవర్ఫుల్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం 'లవ్‌జర్నీ'. శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి16) విడుదల కావాల్సి ఉండగా మద్రాసు హైకోర్టు ఆదేశాలతో సినిమా విడుదల ఆగి పోయింది. అందనిది అందినట్లుగా డైరీలో రాసుకుంటూ తియ్యని అనుభూతికి లోనయ్యే ఓ యువకుడి ప్రేమకథలోని మలుపులను 'లవ్ జర్నీ'గా తెరకెక్కించారు. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన 'కనిమొళి' చిత్రానికి ఇది రీమేక్.
ఈ సినిమాలో నటించిన నటి సోనా మద్రాసు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సినిమా సహ నిర్మాతలలో ఒకరైన సోనాను సంప్రదించకుండా తెలుగులో విడుదలకు రంగం సిద్ధం చేయడంతో ఆమె కోర్టు ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలు లేకుండా ఈ సినిమా విడుదల చేయడానికి వీల్లేదని నిషేదం విధించింది. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత: మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం: శ్రీపతి.