twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్... అంజలి వ్యవహారంలో కోర్టు మలుపు!

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోయిన్ అంజలి పిన్ని భారతీదేవి తన దత్తపుత్రిక కనపడటంలేదని చెన్నయ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఈనెల 24లోపు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించిన నేపథ్యంలో సైదాపేట పోలీసులు అంజలిని అక్కడికి తీసుకెళ్లనున్నారు.

    ఇటీవల తన పిన్ని, బాబాయ్ తనను డబ్బులకోసం ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళిద్దరే కాక తమిళ దర్శకుడు కళంజియమ్ ప్రమేయం కూడా ఉందని మీడియాకి ఎక్కిన అంజలి ఉదంతం మరోమలుపు తిరిగింది. చిన్న గొడవతో సమసిపోతుందిలే... అనుకున్న అంజలికి ఆ వివాదం పెనుముప్పుగా మారే పరిస్ధితి కనపడుతోంది.

    తనపై అవాంఛిత ఆరోపణలు చేసిన అంజలిని కోర్టుకు ఈడుస్తానని అప్పట్లో దర్శకుడు కళంజియమ్ వివాదాస్పద వ్యాఖ్యానాలు చేశాడు. దాంతో ఆమె కోర్టు గుమ్మం ఎక్కక తప్పటం లేదు. కోర్టుకు వెళ్లాక కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏమో అని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

    పోలీసులను కోర్టులను ఆమె తప్పుదోవ పట్టించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కోర్టు ఎటువంటి ప్రకటన చేయనుందోనని టాలీవుడ్ నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అలా కాకుండా, కేసు తేలేవరకూ అంజలి చెన్నయ్‌లోనే ఉండాలని ఆదేశిస్తే... మన నిర్మాతలు మళ్లీ చెన్నయ్ వెళ్లి షూటింగ్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ నెల 24 తరువాత ఏ సంగతీ తెలియనుంది.

    English summary
    
 Responding to the corpus petition filed by Anjali's aunt Bharati Devi that her daughter was missing, High Court issued summons to the actress directing her to appear before it on 24th. Seems like the troubles for Anjali will n't end anytime soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X