twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.O మూవీ లీక్‌పై కోర్టు సీరియస్.. 12 వేలా?.. వాటిని బ్లాక్ చేయాలని వార్నింగ్

    |

    దేశ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో రూపొందిన 2.O చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. అయితే ఈ సినిమా తొలి రోజే పైరసీ బారిన పడింది. తమిళ రాకర్స్ వెబ్‌సైట్ హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ను అప్‌లోడ్ చేసింది. దాంతో లైకా ప్రొడక్షన్ చేసిన శ్రమ అంతా వృథా అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఏమన్నదంటే..

    మద్రాస్ హైకోర్టు సీరియస్

    మద్రాస్ హైకోర్టు సీరియస్

    2.O సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ వెబ్‌సైట్లపై ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకోవాలని లైకా ప్రొడక్షన్ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే 2.O చిత్రం లీక్ కావడంపై మద్రాస్ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. 10000 మంది టెక్నిషియన్లు పనిచేసిన సినిమాను ఒక్కరోజులోనే పైరసీకి గురిచేయడం అన్యాయమని పేర్కొన్నది.

    ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి..

    ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయండి..

    పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయండి. దాదాపు 12 వేల వెబ్‌సైట్లు జాబితాలో ఉన్నాయి. వాటన్నింటిపై ఆంక్షలు విధించాలని 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు గురువారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన 2.O మూవీ నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

    2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం

     ప్రత్యేక బృందాలతో ఇంటర్నెట్‌లో గస్తీ

    ప్రత్యేక బృందాలతో ఇంటర్నెట్‌లో గస్తీ

    రిలీజ్‌కు ముందు 2.0 సినిమాను పైరసీకి గురికాకుండా లైకా ప్రొడక్షన్ గట్టి జాగ్రత్తలు తీసుకొన్నది. పది మందితో ఇంటర్నెట్‌లో గస్తీ కోసం బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నామో మేము బయటికి వెల్లడించలేమని చెప్పింది. గుట్టు చప్పుడు కాకుండా పైరసీ దాడులను అడ్డుకొంటామని లైకా ప్రొడక్షన్ చెప్పినప్పటికీ బలంగా ప్రభావం చూపలేకపోయింది.

     లైకా ప్రొడక్షన్ ప్రయత్నాలు ఫెయిల్!

    లైకా ప్రొడక్షన్ ప్రయత్నాలు ఫెయిల్!

    తమిళ్ రాకర్స్ హెచ్చరికలో నేపథ్యంలో పైరసీని అడ్డుకునేందుకు చెన్నై, ఢిల్లీలో లైకా ప్రొడక్షన్ ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసింది పైరసీ లింకులు కనిపిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేస్తాం. థియేటర్లలో కొంత మంది సిబ్బందిని కూడా పెడుతున్నాం. మా పరిధిలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని లైకా ప్రొడక్షన్ వెల్లడించినప్పటికీ.. తమిళ రాకర్స్ ఆగడాలను నిలువరించలేకపోయింది.

    English summary
    Lyca Productions have reportedly listed down over 12,000 websites that can potentially host pirated versions of their film. 2.0 starring Akshay Kumar and Rajinikanth will be releasing tomorrow over across 10,000 screens worldwide. Rajinikanth's recently-released 2.0 has fallen prey to online piracy as TamilRockers leaked the HD version of the movie hours after the film hit the screens. In this situation, Madras high court seriously reacted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X