అల్లు అరవింద్'గజని'కి బ్రేక్

దీంతో ఆ చిత్ర వర్గాలు ద్రిగ్భాంతి చెందాయి. గీతా ఆర్ట్స్ అప్పీలు మేరకు ఈ కేసుపై బుధవారం మళ్లీ విచారణ జరుగనుంది. మరోవైపు ముంబైలో కేబీసీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లేల కాపీరైట్‌ను తాము సొంతం చేసుకున్నామంటూ గీతాఆర్ట్స్‌పై బాంబే హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణకు రానుంది.
మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మార్కెట్ జరిగిన అమీర్‌ఖాన్ తొలి చిత్రమిదని సినీ వర్గాల కథనం. డ్రిస్టిబ్యూషన్ హక్కులను బాలీవుడ్‌కు చెందిన ఎరోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇది తమిళంలో సూర్య కథానాయకుడిగా విడుదలైన 'గజని' రీమేక్ వర్షన్. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న గజనీ చిత్రం క్రిస్మస్ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి వుంది. ఇక ఈ గజనీ చిత్రం హాలీవుడ్ చిత్రం 'మొమెంటో' నుంచి ప్రేరణ పొందినది అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











