twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెలరేగిన ఇళయరాజా.. తన్మయత్వంలో చిరంజీవి, జోష్‌లో మంచు లక్ష్మీ

    By Rajababu
    |

    Recommended Video

    An Evening With Ilayaraja చెలరేగిన ఇళయరాజా

    మ్యూజిక్ మ్యాస్ట్రో, లయరాజ ఇళయరాజా సంగీత విభావరిలో సినీ, సంగీత అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. హంగేరి బృందం పాల్గొన్న ఈ కార్యక్రమం సుమారు నాలుగు గంటలపాటు చాలా ఆసక్తికరంగా సాగింది. 80, 90 దశకాలలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన పాటలను ఇళయరాజా ప్రజెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ గాయకులు మనో, చిత్ర, యువ గాయకుడు కార్తీక్, ఇతర గాయనీ గాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మోహన్‌బాబు, డీ సురేష్ బాబు, మంచు లక్ష్మీ, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఇంకా సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు.

     ఆణిముత్యాల్లాంటి పాటలతో

    ఆణిముత్యాల్లాంటి పాటలతో

    అన్వేషణ, ఘర్షణ, కూలీ నంబర్ 1, బొబ్బిలిరాజా, జగదేకవీరుడు అతిలోక సుందరి, మహర్షి, పదహారేళ్ల వయసు ఇతర చిత్రాల్లోని అణిముత్యాల్లాంటి పాటలతో ఈ సంగీత విభావరిని ఇళయరాజా రక్తికట్టించారు. మ్యూజిక్ కన్సర్ట్‌లో ఆయా పాటలను సమకూర్చే సమయంలో జరిగిన చోటుచేసుకొన్న తెర వెనుక విషయాలను మధ్య మధ్యలో వినిపించారు.

     వన్స్ మోర్‌కు అర్థం చెప్పిన..

    వన్స్ మోర్‌కు అర్థం చెప్పిన..

    పాటలకు వన్స్ ‌మోర్ అని అభిమానులు గోల చేయగా.. మళ్లీ మళ్లీ పాడటానికి మేము సిద్ధమే కానీ.. వన్స్ మోర్ అంటే పాటను సరిగా ఆలపించలేదని అర్థం చేసుకొంటాను అని ఇళయరాజా అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరోసారి వన్స్ మోర్ అనే మాట వినిపించలేదు.

     అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు

    అబ్బనీ తియ్యనీ దెబ్బ పాటకు

    జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బ నీ తీయ్యని దెబ్బ పాటను ఆలపించగా సంగీత ప్రియుల నుంచి పెద్ద ఎత్తున్న స్పందన వచ్చింది. చిరంజీవి దంపతులు పాటకు అనుగుణంగా తాళం వేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. సైరా నరసింహరెడ్డి గెటప్‌లో చిరంజీవికి ఈ కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

     గీతాంజలి పాటకు మంచు లక్ష్మీ జోష్

    గీతాంజలి పాటకు మంచు లక్ష్మీ జోష్

    ఇక గీతాంజలి చిత్రంలోని ఒళ్లంత జల్లంత కావాలిలే పాటకు మంచు లక్ష్మీ మంచి రెస్పాన్స్ ఇచ్చింది. పాటలో లీనమైపోయి తన్మయత్వంతో పాడుతూ సంగీత ప్రియులను ఆకట్టుకొన్నారు. అలాగే ప్రతీ పాటను ఎంజాయ్ చేస్తే మంచి మూడ్‌లో మంచు లక్ష్మి కనిపించారు.

     జోరుగా.. హుషారుగా సురేష్‌బాబు

    జోరుగా.. హుషారుగా సురేష్‌బాబు

    బొబ్బిలిరాజాతోపాటు ఇతర పాటలు పాడినప్పుడు ప్రముఖ నిర్మాత డీ సురేష్ బాబు చాలా హుషారుగా కనిపించారు. అయ్యప్పమాలలో ఉన్న సురేష్ తమ సంస్థ రూపొందించిన సినిమాల పాటలు పాడినప్పుడు ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

     మధ్యలోనే వెళ్లిన మోహన్‌బాబు

    మధ్యలోనే వెళ్లిన మోహన్‌బాబు

    ఇళయరాజా సంగీత విభావరి కొనసాగుతుండగానే మోహన్‌బాబు తన మనమరాళ్ళతో కలసి మధ్యలోనే వెళ్లిపోయారు. తన బావ వెంకటాద్రినాయుడు మరణ శోకం నుంచి ఇంకా మోహన్‌బాబు బయటపడినట్టు కనిపించలేదు.

     మనో, ఇళయ మధ్య ఆసక్తికరంగా

    మనో, ఇళయ మధ్య ఆసక్తికరంగా

    సంగీత విభావరి మధ్యలో మనో, ఇళయరాజా మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. తాను గాయకుడిగా మారేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో తనకు మనో అని పేరుపెట్టి గాయకుడిగా అవకాశమిచ్చింది ఇళయరాజా అన్నయ్య అని చెప్పారు. పాటలు శృతి తప్పి పాడిన గాయనీ, గాయకులను వేదికమైన సున్నితంగా మందలించారు.

     పాటను తప్పుగా పాడినా చప్పట్లే..

    పాటను తప్పుగా పాడినా చప్పట్లే..

    ఓ దశలో మనో పాట పాడుతూ.. తెలుగుకు బదులు తమిళ వెర్షన్ పాడటం జరిగింది. అయితే వెంటనే సరిద్దిద్దుకొని తెలుగులో పాటను పూర్తిచేశారు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ఇళయరాజా మాట్లాడుతూ.. నీవు పాటను తప్పుగా పాడినా ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అది తెలుగు సంగీత ప్రియుల గొప్పతనం అని మనోకు చురకలు అంటించారు.

     కనీస వసతులు కరువు

    కనీస వసతులు కరువు

    హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇళయరాజా సంగీత విభావరి అనగానే పెద్ద ఎత్తున సంగీత అభిమానులు తరలివచ్చారు. వయోవృద్ధులు ఎక్కువగానే కనిపించారు. అయితే నిర్ణీత సమయానికి రెండు గంటలు ఆలస్యంగా అంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైన కార్యక్రమంలో కనీస వసతులు కూడా కల్పించలేదు. టీ, వాటర్, ఇతర తిను బండారాలను ఎక్కువ రేట్లకు అమ్మారు. దీంతో సామాన్య జనం, చిన్న పిల్లలు చాలా ఇబ్బందికి గురయ్యారు. కుర్చీలు ప్రేక్షకులే స్వయంగా తెచ్చుకొని కూర్చొన్నారు. చైర్లు ఎక్కువగా లేకపోవడంతో రన్నింగ్ ట్రాక్‌పై కొందరు నేలపై కూర్చొని ఇళయరాజా కార్యక్రమాన్ని వీక్షించారు.

    English summary
    Music maestro Ilayaraja regaled a sea of humanity that descended on the Gachibowli Stadium to listen to the live band show on a pleasant Sunday night. The programme began two hours behind schedule at 8 p.m., but music-lovers at the jam-packed stadium remained in their seats patiently. Every song that followed struck a chord with the audience. Symphony orchestra from Hungary gave the music to the direction of Ilayaraja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X