నితిన్ మాస్ట్రో నుంచి మరో సర్‌ప్రైజ్.. అసలు క్లారిటీ వచ్చేది ఆ రోజే!
యువ హీరో నితిన్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇటీవల కాలంలో మళ్లీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గతేడాది భీష్మ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టే వచ్చిన నితిన్ ఆ తర్వాత ఎప్పటిలాగే వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నాడు. నితిన్ భీష్మ సినిమా కంటే ముందు వరుసగా మూడు సినిమాలతో ప్లాప్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన భీష్మ సినిమా మళ్లీ నితిన్ పాత మార్కెట్ను ట్రాక్ లోకి తెచ్చింది. ఆ సినిమా అనంతరం అదే తరహాలో సక్సెస్ తో కంటిన్యూ అవ్వాలని అనుకున్నాడు కానీ మళ్లీ ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి.
భారీ అంచనాల నడుమ విడుదలైన చెక్ సినిమా మొదట బాక్సాఫీసు వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ భావించారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ప్రయోగాత్మకమైన సినిమా మొదట కాస్త డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి ఆ తర్వాత కలెక్షన్స్ అందుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన రంగ్ దే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక గతంలో మాదిరిగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకోవద్దని ఫిక్సయిన నితిన్ ఈసారి మాస్ట్రో సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకొన్నాడు. అయితే ఈ సినిమాపై నమ్మకం ఉన్నా కూడా థియేటర్స్ లో విడుదల చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు.

సెప్టెంబర్ 10న ఈ మూవీని హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేయబోతున్నటీలు తెలుస్తోంది. సినిమా డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ హక్కులను 32 కోట్లకు అమ్మినట్లు సమాచారం. మాస్ట్రో బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ మొదటిసారి కళ్ళు లేని పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆగస్టు 23న విడుదల చేయబోతున్నారు.
అదే రోజు సినిమా విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాపై ఇలాంటి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇండస్ట్రీలో అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా నెగిటివ్ పాత్రలో నటించగా నాభా నటేష్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతున్న నితిన్ మొదటి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది చూడాలి.

ఇక మరోవైపు నితిన్ కొత్త సినిమాలను కూడా లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే వస్తోంది. అలాగే మరొక సినిమాపై కూడా వీలైనంత త్వరాగా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎలాగైనా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాతో హాట్ అయితే అందుకోవాలని ఆలోచిస్తున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











