విశాల్, రానా, హన్సిక మగమహారాజు ఆడియో(ఫోటోస్)
హైదరాబాద్: విశాల్ ఈ నెలలో ‘మగమహారాజు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ మూవీ 'అంబాల' చిత్రాన్ని ‘మగహహారాజు' పేరుతో ఇక్కడ అనువదించి విడుదల చేస్తున్నారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్‌హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
విశాల్ హీరోగా నటిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్‌రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో రానా ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేసారు.
తమిళ వెర్షన్ ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ 15న లేదా నెలాఖరున విడుదల చేసే అవకాశం ఉంది. విశాల్ నటించిన తమిళ చిత్రాలన్నీ కూడా దాదాపు తెలుగులోకి డబ్బింగ్ అయ్యాయి. తన మొదటి చిత్రం 'పందెం కోడి' నుంచి ఇటీవలే వచ్చిన 'పూజ' సినిమా వరకు అన్ని తెలుగులోకి అనువదించారు. స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు.

రానా గురించి విశాల్...
ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ అయిన రానా చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు అని చెప్పుకొచ్చాడు.

చాలా కష్టపడ్డాం
సినిమాలో మస్కట్‌లో చేసిన పాట కోసంచాలా కష్టపడ్డాం. రోజూ ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లి షూటింగ్ చేసామని తెలిపారు. కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది అవుతుందన్నారు.

త్వరలో తెలుగు సినిమా
త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాను అన్నారు.

రానా మాట్లాడుతూ..
సౌత్ ఇండస్ట్రీలో విశాల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి విజయం సాధించాలి అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్
ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన హిప్ హాప్ మాట్లాడుతూ...నాకు అవకాశం ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్. తమిళంలో ఆడియో సక్సెస్ అయింది. తెలుగులోనూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హన్సిక
సినిమా చాలా బావుటుంది. ఎంటర్టెనింగుగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది అన్నారు.

కామెడీ ఎలిమెంట్స్
సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ బావున్నాయి. ఇందులో మంచి క్యారెక్టర్ చేసాను అని వైభవ్ తెలిపారు.

ముఖ్య పాత్రలు
ఈ చిత్రంలో విశాల్, హన్సికలతో పాటు నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్‌రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

తమిళ డబ్బింగ్
తమిళ మూవీ 'అంబాల' చిత్రాన్ని ‘మగహహారాజు' పేరుతో ఇక్కడ అనువదించి విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











