twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్..'మగధీర' శతదినోత్సవ వేడుక వివరాలు

    By Srikanya
    |

    రామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్లో రాజమౌళి రూపొందించిన మగధీర వందరోజుల ఉత్సవాన్ని ఘనంగా జరపాలని అల్లు అరవింద్ నిర్ణయించినట్లు సమాచారం. డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఉత్సవం అభిమానుల సమక్షంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి ఇంద్ర ఫంక్షన్ అప్పట్లో విజయవాడలో జరిగింది. దాన్ని చాలా గొప్పగా అబిమానులు చెప్పుకున్నారు. దాన్ని బీట్ చేసే రీతిలో ఈ పంక్షన్ ప్లానింగ్ చేసినట్లు చెప్తున్నారు. ఇక ఈ పంక్షన్ లో పాల్గొనాలంటూ ఎక్కడెక్కడి చిరంజీవి, పవన్, రామ్ చరణ్ అభిమానులుకు సమాచారం పంపిస్తున్నారు. వారు తమదైన శైలిలో ఈ పంక్షన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. చిరంజీవి కూడా ఈ మెగా పంక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ పరిశ్రమ మొత్తం ఈ మధ్య కాలంలో ఏ సినిమా వందరోజుల పండుగ ఇంత ఘనంగా జరుపుకోలేదన్నట్లు తెలియచేయాలని ఉత్సాహపడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రామ్ చరణ్ మాత్రం తన తదుపరి చిత్రం ఆరెంజ్ కోసం లొకేషన్స్ ఫిక్స్ చేసే యోచనలో ఉన్నారు. ఆ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X