మగధీరాకు ‘ఎ’ వివాదం
మగధీర సినిమాకి సంబంధించి మరో వివాదం తలెత్తింది. రికార్డ్ స్థాయిలో ట్రేడ్ టాక్ తో జయహొ అంటున్న మగధీర కు మరో కొత్త వివాదానికి బ్రేక్ వేయాల్సివుంది. ఇటీవలనే ఆ సినిమాపై ప్రజాగాయకుడు వంగపండు, విజయవాడకు చెందిన న్యాయవాదులు ఆగ్రహావేశాలకు గురైన విషయం తెలిసందే. అయితే ఈ వివాదాలు పూర్తిగా సమసిపోకముందే మరో సమస్య వచ్చిపడింది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ" గుర్తు లేకుండానే పోస్టర్లు ముద్రించడం హొర్డింగ్ లు ఏర్పాటు చేయడంపై సైఫాబాద్ కు చెందిన జి. హనుమంతరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు వేసుకున్న పిటిషన్ ను నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి. రవికుమార్ విచారించారు.
magadheera ramcharantej raja mouli allu aravind vangapandu balaji hanumanth rao a posters case మగధీర ఎ రామ్ చరణ్ తేజ రాజమౌళి అల్లు అరవింద్


Click it and Unblock the Notifications