డాడీతో చేయడం చాలా సంతోషం
డాడీ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు, ఆయనతో కలిసి నటించలేనేమోనని అనుకున్నాను ఆయనతో కలిసి, ఒక పూర్తి స్థాయి చిత్రంలో నటించాలన్నదే నా కోరిక. ఇదే విషయాన్ని డైరెక్టర్ కు చెప్పాను. డైరెక్టర్ సినిమాలో డాడీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్ ను సష్టించారు. ఎంతో కష్టంతో ఆయన్ను ఒప్పించాము. ఆయనతో కలిసి నటించడం నాకెంతో సంతోషంగా ఉంది అని మొన్నీమద్య ఓ ఇంటర్యూలో చెప్పారు. సినిమా పూర్తయ్యి, డాడి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత చాలా సంతోషంతో నన్ను కౌగిలించుకొని అభినందించారు. దీంతో సినిమా విజయం పట్ల నాకున్న టెన్షన్ పోయింది. చిరుతకి మగధీరకి మద్య నాలోని పెరుగుదలను మెచ్చుకున్నారు. నేను 50 సినిమాల్లో సాధించిన పేరును ఈ ఒక్క సినిమాలో సాధించానని అభినందించారు.
ఈ అభినందనకి కారణం చిరుత సినిమాలో లాగా డ్యాన్స్ బాగా చేశాను. ప్రధానంగా కథ, పైట్స్, హార్స్ రైడింగ్ అన్ని విధాలుగా ప్రేక్షకులు అభినందిచడమేనన్నారు. ఈ సినిమాలో ఉపయోగించిన గ్రాఫిక్స్ అత్యంత ఆధునికమైనవి. సినిమా చూస్తున్నంత సేపు నిజమైనవని భ్రమపడ్డాను. వచ్చే ఏడాది ఈ సినిమా అవార్డులను సాదిస్తుందని నా అంచానా ఈ క్రెడింట్ అంతా డైరెక్టర్ రాజమౌళికి దక్కుతుందని రామ్ చరన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











