మగధీర రికార్డుల మోత
ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో, 1500 థియేటర్లలో విడుదలై రికార్డు సృష్టిచిన మగధీర సినిమా ఇప్పుడు కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో మూడు రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి కనబడుతోంది. దీంతో తొలి మూడు రోజుల్లో 15 కోట్లు వసూలు చేసే అవకాశం వుందని, 20 రోజుల్లోపే సినిమా లాభాలు ఆర్జించేస్థాయికి చేరుకుంటుందని, మొత్తం మీద 80 నుండీ 90 కోట్ల వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా వుండగా పైరసీనుండీ సినిమాను రక్షించుకోవడానికి ఇరవైఒక్క ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన్నట్టు సమాచారం.
magadheera ram charan teja kajal rajamouli prints allu aravind chiranjeevi విజయేంద్ర ప్రసాద్ ఎం రత్నం కీరవాణి కెకెసెంథిల్ కుమార్ అల్లు అరవింద్ ఎస్ ఎస్ రాజమౌళి


Click it and Unblock the Notifications