కంగ్రాట్స్ 'మగధీర' రాజమౌళి అండ్ టీమ్ ...
మగధీర పేరు చెప్పి ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరోసారి విన్నయ్యారు. కమర్షియల్ గా ఈ చిత్రాన్ని నెంబర్ వన్ లో నిలపటమే కాక తాజాగా రెండు నేషనల్ అవార్డులు ఈ చిత్రానికి సంపాదించి పెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఉత్తమ కొరిగ్రాఫర్ గా శివ్ కుమార్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కమల్ కణ్ణన్‌లకు జాతీయ పురస్కారం దక్కింది. 57వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ చిత్రంలో ధీర..ధీర అంటూ సాగే పాటకు ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా శివ్ కుమార్ మాట్లాడుతూ...జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూసానని, మగధీర చిత్రంలో చరణ్ కి కొరియోగ్రఫీ అదృష్టమని భావించానని, ఇప్పుడు జాతీయ అవార్డు రావటంతో తనకు మరింత ఆనందాన్ని కలిగించిందంటున్నారు. ఇక రాజమౌళి కూడా ఈ జాతీయ అవార్డులు రావటం తన టీమ్ అందరికీ సంతోషాన్న ఇచ్చిందంటున్నారు. అయితే తెలుగులో కేవలం ఈ రెండు అవార్డులే వచ్చాయి. మరే చిత్రానికి రాలేదు. ఇక అవార్డులను సెప్టెంబర్ 15, 2010న న్యూడిల్లీలో అందచేసారు. ఈ సందర్బంగా రాజమౌళికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











