రికార్డుల మగ'ధీరుడు'
'మగధీర'. ఈ చిత్రం గురించిన వార్త చదవాలంటే చాలు, ఏదో ఒక కొత్త రికార్డు సృష్టించిందని వుంటుంది. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటి వార్తే. ఎప్పుడూ రికార్డుల గురించేనా అంటే మేము కానీ ఏం చెయ్యగలం, ఈ సినిమా రోజుకో రికార్డు సృష్టిస్తోంది మరి.
ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు ప్రస్తుత రికార్డు ఎంటో చెప్పండి అంటున్నారా!! అయితే ఇంకెందుకు ఆలస్యం..మగధీర చిత్రం విడుదలయి రేపటితో(సెపెంబరు 18) 50 రోజులవుతుంది. యాభై రోజులకు గాను రోజుకో రికార్డు చొప్పున లెక్కేసినా, ఈ రికార్డుల లెక్క 50 దాటుతుంది. అయినా 50రోజులు దాటడం ఏం రికార్డు అనుకుంటున్నారా?? అందులో రికార్డు లేకపోయినా 301 సెంటర్లలో 50రోజులు పూర్తి చేసుకోవడం మాత్రం రికార్డే. తెలుగు సినీ చరిత్రంలో మరే సినిమా ఇన్ని సెంటర్లలో 50రోజులు ప్రదర్శింపబడలేదు. అయినా ఇదేమీ అంత అతిశయోక్తి కాదు, ఇంకా ముందు ముందు చాలా రికార్డులు సృష్టించాలి అన్నట్టుగా దూసుకుపోతున్నాడు మన 'మగధీరు'డు.
అన్నట్టు ఈ సినిమా ఆంధ్రరాష్ట్రానికి ధీటుగా కర్ణాటకలో వసూల్లు రాబట్టింది. దీనికి కృతజ్ఞతగా 50 రోజుల పండుగని బెంగళూరులో సెపెంబరు 18న జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు రామ్ చరణ్, నిర్మాత అల్లు అరవింద్ హాజరవనున్నారు.


Click it and Unblock the Notifications