మగ'ధీర' సరికొత్త రికార్డులు
అందరూ ఊహించినట్టుగానే మగధీర చిత్రం ఘనవిజయం సాధించినా...ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్నమొన్నటి వరకూ మొదటి వారం కలెక్షన్లు 15 కోట్లు ఉంటుందని అంచనా వేసినవారు ముక్కునవేలేసుకొనేలా 22 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. రామ్ చరణ్ ఛార్మింగ్ పర్ఫార్మెన్స్, 'జక్కన్న' రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, అత్యాధునిక సాంకేతిక విలువలతో వచ్చిన ఈ చిత్రాన్ని ఏక కాలం లో 1500 థియేటర్లలో విడుదలచేయడం బాగా కలసివచ్చిందని, దీనికి తోడు ఈ చిత్రానికి మొదటి ఆట నుండీ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సక్సెస్ రేంజ్ ని ఈ స్థాయికి పెంచడానికి బాగా ఉపయోగపడాయి అనేది సినివిశ్లేషకులు అభిప్రాయం. ఈ చిత్రంతో రామ్ చరణ్ అన్ని ఏరియాల్లోనూ మొదటి వారం కలెక్షన్లు కోటిపై గా వసూలు చేసిన హీరోగా చరిత్ర సృష్టించారు.
ఈ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా వున్నాయి:
ఏరియా కలెక్షన్లు
నిజాం 7 కోట్లు
సీడెడ్ 3.5 కోట్లు
గుంటూరు 1.70 కోట్లు
పశ్చిమ గోదావరి 1.15 కోట్లు
తూర్పు గోదావరి 1.20 కోట్లు
వైజాగ్ 1.70 కోట్లు
కృష్ణ 1.20 కోట్లు
నెల్లూరు 1.0 కోట్లు
కర్ణాటక 1.0 కోట్లు
ఉత్తర భారతం 0.20 కోట్లు
ఓవర్ సీస్ 2 కోట్లు
మొత్తం 21.65 కోట్లు


Click it and Unblock the Notifications











