పాన్ ఇండియా హీరోగా, నిర్మాతగా మగధీర విలన్.. దేవ్ గిల్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

మగధీర సినిమాలో రాం చరణ్‌కు ధీటుగా విలనిజాన్ని పండించిన నటుడు దేవ్ గిల్ హీరోగా మారారు. ఏకంగా ఆయన పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుండటం విశేషంగా మారింది. సొంత బ్యానర్‌ దేవ్ గిల్ ప్రొడక్షన్స్ సమర్పణలో అహో విక్రమార్క సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

అహో విక్రమార్క సినిమాను ఆర్తీ దేవెందర్ గిల్, మహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పన్మెత్స ప్రసాద్ వర్మ కథను, రవి బస్రూర్, ఆర్కో ప్రావో ముఖర్జీ సంగీతం అందించారు. ఈ సినిమాకు తమ్నిరాజు ఎడిటింగ్ భాద్యతలు నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు భారీ స్పందన వస్తున్నది.

Magadheera Fame Dev Gill truns Pan India producer and Hero for Aho Vikramarka Here Is the Release date

నిర్మాతలు ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ ఫుల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారనే విషయం అర్ధమైంది. ఫస్ట్ లుక్‌తోనే కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నాడనే ఫీల్ కలిగింది. దాంతో సినిమాపై మరింత బజ్ పెరిగింది. ఈ సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

తాజాగా హీరో దేవ్ గిల్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ధైర్య సాహసాలు, వారి అంకిత భావం గురించి మంచి కథతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా కథ, కథనాలు బలంగా ఉండటం వల్ల సినిమా ఫీల్ గుడ్‌గా వచ్చింది. పాన్ ఇండియాలో ఈ సినిమాకు వస్తున్న క్రేజ్‌ను చూసి థ్రిల్ అయ్యాం. ఆగస్టు 30న ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందనే ఆలోచన మాకు ఎక్సైట్‌గా ఉంది అని అన్నారు.

Magadheera Fame Dev Gill truns Pan India producer and Hero for Aho Vikramarka Here Is the Release date

దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ.. అహో విక్రమార్క సినిమా ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ చిత్రాల్లో హైలెట్‌గా నిలుస్తుంది. చాలా పకడ్బంధీగా ప్లాన్ చేసి సినిమా షూట్ పూర్తి చేశాం. ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి రెస్సాన్స్ రావడం హ్యాపీగా ఉంది. దేవ్‌ను మీరు తెర మీద కొత్త కోణంలో చూస్తారు అని అన్నారు.

Magadheera Fame Dev Gill truns Pan India producer and Hero for Aho Vikramarka Here Is the Release date

నటీనటులు: దేవ్ గిల్, షియాజీ షిండే, ప్రవీన్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు
నిర్మాతలు: ఆర్తీ దేవెందర్ గిల్, మహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్రా
దర్శకత్వం: త్రికోటి పేటా
కథ: పెన్మెత్స ప్రసాద్ వర్మ
మ్యూజిక్: రవి బస్రూర్, ఆర్కో ప్రావో ముఖర్జీ
సినిమాటోగ్రఫి: కరమ్ చావ్లా, గురు ప్రసాద్ ఎన్
ఎడిటర్: తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్: కార్తీక్ విధాతే
స్టంట్స్: రియల్ సతీష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X