మహేష్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓపెన్ ఛాలెంజ్
రీసెంట్ గా మహేష్ తన ట్విట్టర్ లో .. ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్. .అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది డైరక్ట్ గా మగధీర ను క్రాస్ చేసిందని అన్నట్లుగా రామ్ చరణ్ అబిమానులు ఫీలయ్యారు. దాంతో కర్నూల్ లోని రామ్ చరణ్ అభిమానులు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేసారు. అందులో...కర్నూలు లక్ష్మి ధియోటర్ లో రోజూ 4 ఆటలతో 757 రోజులు ఆల్ టైం సౌత్ రికార్డు మగధీర క్రియోట్ చేసిందని రాసుకొచ్చారు. అంతేగాక ఎవరెన్ని రికార్డులు సాదించినా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఉన్న మగధీర రికార్డులను దాటటం ఎవరితనం అంటూ మగధీర కలెక్షన్స్ మరో సారి గుర్తు చేసారు. అంతేగాక ..నిజాయితీగా వచ్చిన కలెక్షన్స్ వివరాలివి.ఇష్టం వచ్చిన కలెక్షన్స్ కావివి. మామూలు రేట్లుపై అంటే 30,40 లతో ఒక్క ఎగస్ట్రా ఛైర్ వేయకుండా నాలుగు ఆటలతో వసూలు చేసిన సంచలన చిత్రం పర్శంటేజ్ ని పెంచలేదు.
గమర్నమెంట్ రూల్స్ అతిక్రమించలేదు.స్లాట్ రేట్లు అమ్మలేదు. ఎటువంటి గారడి చేయలేదు అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 303 సెంటర్లలో మగధీర ఆల్ టైమ్ జిల్లా మరియు టౌన్ రికార్డులు సృష్టించింది.ఇతరులవి 15 సెంటర్లో అయినా రికార్డులు చూపగలరా అని ఛాలెంజ్ చేసారు. ఎ సెంటర్ నుంచి సి సెంటర్ వరకూ ఏ సెంటర్ లో నైనా సరే పట్టుమని 10 సెంటర్లలో మగధీర రికార్జులను బ్రేక్ చేసామని చూపగలరా. ఇది మా ఓపెన్ ఛాలెంజ్. పబ్లిసిటి స్టంట్ తో డూప్ రికార్డులు చెప్పుకోవటం కాదు, నిజాయితీగా వచ్చిన రికార్జులను చూపుకోండి.. ఇట్లు చిరంజీవి అభిమానులు, అనంతపురం అంటూ ఛాలెంజ్ చేసారు.మరి మహేష్ ఫ్యా న్స్ దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











