twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ యుద్దం "మెగాస్టార్" చేయాల్సింది: మగధీర రహస్యాన్ని చెప్పిన విజయేంద్ర ప్రసాద్

    మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్.

    |

    'శ్రీవల్లీ' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడూ, స్టార్ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ అతడి గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. అయితే అప్పటికి అవకాశం రాక, తర్వాత సినిమాలకు చిరూ దూరమైపోవటం తో ఆ సీన్ ని "మగధీర" కోసం వాడేసారు. అసలు ఆ సీన్ సినిమా హైలేట్స్ లో ఒకటిగా నిలిచింది.

    ''సింహాద్రి సినిమా సూపర్ హిట్టయ్యాక మీడియా వాళ్లు రాజమౌళిని.. చిరంజీవితో సినిమా చేయరా అని అడిగారు. దానికి బదులిస్తూ.. చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి.. ఆయన వరమివ్వాలి కానీ.. తెలుగులో ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేసి తీరాలని కోరుకునే దర్శకుడు చిరంజీవి గారే అని చెప్పాడు. ఆ తర్వాత చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు, రాజమౌళికి వచ్చింది.

     Magadheera Fight Scene Written For Chiranjeevi?

    ఆయన తనతో సినిమా చేయమని అడిగారు. మహాభాగ్యం అనుకుని వెళ్లి 'మగధీర'లో వచ్చే 100 మందితో హీరో ఫైట్ ఎపిసోడ్ రాసుకుని వెళ్లి ఆయనకు చెప్పాం. ఆయనకు బాగా నచ్చింది. దాని ఆధారంగా సినిమా చేద్దామన్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆయనతో సినిమా చేయడం కుదర్లేదు. తర్వాత అనుకోకుండా చరణ్‌తో 'మగధీర' చేశాం. ఆ సినిమాకు ఆ సీన్ వాడుకున్నాం'' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మొత్తానికి అంత ఇంపాక్ట్ చూపించిన సీన్ ఎవరికి చేరాలో వాళ్ళకే చెందింది.

    English summary
    Star Writer Vijayendra prasad Reveald a secred Behind Magadheera fight 100 yodha's
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X