ఆకాశమంత ‘మగధీర’ కి వందకి వంద!!

By Sindhu

'బెన్ హార్" లాంటి సినిమాను డీవీడిల్లో చూస్తున్నప్పుడు హాలీవుడ్ నైపుణ్యం మురిసిపోతారే తప్ప 'అలాంటి సినిమాను మన తెలుగులో" కనీసం వూహించే సాహపానికి పూనుకోరు మన తెలుగు ప్రేక్షకులు. 'గ్లాడియేటర్" వీరోచిత సాహసాలు చూసి ఎగిరి గంతేస్తారే తప్ప అలా మన కథానాయకుడూ చేయాలని కల్లో కూడా అనుకోరు. మన తెలుగు సినిమా పరిధి ఏమిటో ప్రేక్షకులకు బాగా తెలుసు కాబట్టి, ఈ పరిధులు దాటుకుని ఆ హద్దుల్ని చెరిపేసి ఓ అందమైన అద్భుతాన్ని తెర మీద ఆవిష్కిరించిన చిత్రం 'మగధీర". 24 విభాగాల సమిష్టి కృషికి అద్దం పట్టి ప్రేక్షకుల్ని అలరించి భారీ వసూళ్లను మూటగట్టుకొంది. శనివారం నాటికి అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర" విడుదలై వంద రోజులు పూర్తవుతుంది. 'మగధీర" సినిమాలో చరణ్ 'భలే చేశాడు" అని చిరంజీవి అభిమానులు కితాబులివ్వొచ్చు. 'కాజల్ నిజంగా యువరాణిలా ఉంది" అని అందాన్ని ఆరాదించేవాళ్ళు పొగడొచ్చు. అరవింద్ కోరుకున్నట్లుగానే అందరి మతీపోయేలా 'మెగా బ్లాస్ట్" ని ఇచ్చాడు రాజమౌళి. 302 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 223 కేంద్రాల్లో శతదినోత్పవం జరుపుకుంది. ఈ రోజు(శనివారం) 'మగధీర"కు నూరవరోజు. సినిమా భాషలో శతదినోత్సవం!ఇంత ఘనవిజయం వెనుక రాజమౌళి ప్రధాన మాంత్రికుడుగా నిలిచారు. రూ.40 కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తున్నప్పుడు వేలెత్తి చూపినవారు ఎందరో...! ఈ రోజు రాజమౌళి సాహసాన్ని మెచ్చుకుంటున్నవారు ఎందరెందరో!! ఇంత డబ్బు పెట్టడానికి సాహసించిన అల్లు అరవింద్ ని అభినందిచనివారు ఉండనే ఉండరు.

ఇక రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించుకుంటే 'ఆకాశమంత" అని బదులిచ్చే అభిమాన జనం ఆయన వెంట ఉన్నారు. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో 'బెన్ హార్" ని చెప్పుకున్నట్టే ఇక తెలుగులో 'మగధీర"ని ఓ ల్యాండ్ మార్క్ గా ఉదహరించుకోవలసిన పరిణామం ఇది. లెక్కలపరంగా లిఖించుకుంటే 'తెలుగు సినిమా పండగ" ఇది అని ముదావహంగా మెచ్చుకోవలసిన సందర్బంగా సంబరం...కూడానూ!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X