అర్థశతదినోత్సవ వేడుకలలో ‘మగధీర’

By Staff

'మగధీర" అర్ధశతదినోత్పవ వేడుకలను బెంగళూ మహానగరంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా రామ్ చరణ్ తేజ, అల్లు అరవింద్, కర్ణాటక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డీ హెచ్ శంకర మూర్తి, కార్మిక మంత్రి బచ్చే గౌడ ఇంకా చిరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకటేశ్ తదితరులు ఈ వేడుకు హాజరయ్యారు. ఈ అర్ధశతదినోత్సవ వేడుకలను బెంగళూరు లో నిర్వహించుటకు అభిమానుల కొరిక మేరకు చిరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకటేశ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం ఆద్వర్యంలో మగధీర సినిమా హీరో రామ్ చరణ్ తేజ మాట్లాడుతూ ముఖ్యంగా అర్థశతదినోత్పవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడినికి కారణం రామ్ చరణ్ తేజ ఫ్యామిలికి ప్రపంచంలో కెల్ల బెంగళూరు నగరమంటే ఎంతో ఇష్టమని అందుకే ఈ ప్రాంతంలో ఈ వేడుకలు జరిపడానికి రామ్ చరన్ తేజ వెంటనే ఒప్పుకొనడం విషేశం.

ఈ సందర్భంగా 'మగధీర" రామ్ చరణ్ తేజ మాట్లాడుతూ 'నాను నిమ్మకు నమస్కారంలు" అని కన్నడ బాషలో తన అతిధిలకు, అభిమానులకు హర్షం వ్యక్తం చేస్తూ, పొరుగు రాష్ట్రంలో ఉంటూ తను నటించిన సినిమాకు మీరు బ్రహ్మరంథం పట్టారు. మీరుణం ఈ జన్మలో తీర్చుకోలేనని చేతులు ఎత్తి నమస్కరించారు. కర్ణాటక అంటే నాన్న చిరంజీవికి గుండె లాంటిదని వంద రోజుల పండుగ ఆంద్రప్రదేశ్ లో నిర్వహిస్తామని, ఈ వేడుకల్ని చూస్తుంటే నాకు వంద సినిమాలను తీసినంత దైర్యం ఈ ఒక్క సినిమాతో దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ విజయానికి కారణమైన దర్శకుడు రాజమౌళిగారికి, నిర్మాత అల్లు అరవింద్ గారికి, అభిమానులకు బుణపడి వుంటానని చెప్పారు. తమ కుటుంబానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబానికి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని ఈ తరంలో మేమూ అలాగే కొనసాగిస్తామని సభా ముఖంగా తెలియజేశారు. చిరుత సినిమా తర్వతా రెండు సంవత్సారా గ్యాప్ తో మగధీర సినిమా రావడం కొంచం అసంతృప్తిగా వున్నా ఇంతటి ఘనవిజయం సాదిస్తున్నందు సంతోశిస్తూ ఇకమీదట సంవత్పరానికి రెండు సినిమాలు తీస్తానని చెప్పారు.

కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా కర్ణాటకలో 13 ధియేటర్లో అర్థశత దినోత్సవం జరుపుకొంటున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నేను కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాననిని, మా నాన్న గారికి చిరంజీవి కుటుంబానికి బంధుత్వం లేకపోయినా మేము బందువులు లాగే ఉన్నామని మాది ఒక్కటే కుటుంబమని తెలిపారు. కన్నడ ప్రజలపైన చిరంజీవికి ఎంతో అభిమానం ఉంది కాబట్టే ఆయన కన్నడ సినిమాలో నటించారని వారికి సంబందించిన ప్రతీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తారిని, చిరంజీవి అభిమానుల ఆశీర్వాదంతో రామ్ చరణ్ మరింత ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతకూ 'మగధీర" సినిమాని చిరంజీవికి, ఆయన అభిమనులకు ఒక బహుమతిగా ఇచ్చానని, ఈ విజయం వెనుక రాజమౌళి కృషి ఎంతో ఉందని కొనియాడారు. రాజ్ కుమార్ తో సినమా తీయాలని ఉన్నా తీయలేకపోయానని, వారి కుటుంబంలో ఎవరైనా కాల్ షీట్లు ఇస్తే మగధీర లాంటి సూపర్ డూపర్ సినిమా చేస్తానని అరవింద్ అనడంతో వెంటనే శివరాజ్ కుమార్ తప్ప కుండా చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి డిహెచ్ శంకరి మూర్తి మాట్లాడుతూ 'మగధీర" సినిమా కర్ణాటకలో ఇంతటి ఘన విజయం సాధించినందుకు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణదేవరాయలు పరిపాలించిన సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు ఒక్కటేనని, ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఆ అనుబంధాన్ని కొనసాగించడం ఆనందంగా వుందని సభాముఖంగా తెలిపారు. కార్మిక మంత్రి బచ్చేగౌడ మాట్లాడుతూ కన్నడ ప్రజలకు రాజ్ కుమార్ అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరంజీవి అన్న వీరిద్దరు రెండు కళ్లులాంటి వారని, తాను చిరంజీవి సినిమాలు దరిదాపు అన్నీ చూశానని తెలిపారు. ఇంకా ఈ కార్య క్రమానికి ఇతర ప్రముఖులు, చిరు ఫ్యాన్స్ అధ్యక్షులు, 13 సినిమా ధియేటర్ల ఢిట్రిబ్యూటర్లు, అభిమానులు భారీ ఎత్తున ఆనందోత్సాహంతో పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X