‘మగధీర’ ని పసిగడుతున్న జూ ఎన్టీఆర్-మహేష్ బాబు!
మెగాస్టార్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి తొలిసినిమాతో బాగా చేశాడు అనిపించుకున్న 'రామ్ చరణ్' తన రెండవ సినిమాతోటి బాక్సాఫీసును షేక్ చేసి, టాలీవుడ్ రికార్డులన్నిటిని తుడిచిపెట్టేసి 'మగధీరు'డు అనిపించుకున్నాడు. ఇంతవరకూ 100కోట్లకు పైగా వసూలు చేసి 115 కోట్లు వసూలు చేసే దిశగా ఉన్న ఈ సినిమాను నిశితంగా గమనిస్తున్న హీరోలు తమ చిత్రాలు తప్పక హిట్ అవ్వాలనే పట్టుదలతో పనిచేస్తున్నారట. ముఖ్యంగా టాలీవుడ్ నెం. 1 రేసులో ముందంజలో ఉన్న ఎన్టీఆర్ ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడట. మగధీర సినిమాని చాలాసార్లు చూసి అందులో అంతగా ఆకట్టుకున్న విషయం ఏంటని సమీక్షిస్తున్నాడట. కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోతే తిరిగి రీ షూట్ చేయమని వత్తిడిచేసి మరీ సరిదిద్దుతున్నాడట.
ఇదేకోవలో మహేష్ బాబు కూడా ఏడాదిన్నరగా తన సినిమా ఏదీ విడుదల కాకపోయే సరికి కంగారు పడిపోతున్నాడట. ఎక్కడ తనని ప్రేక్షకులు మరచిపోతారోనని. అందుకే కాబోలు సినిమాలు చేస్తూ, తిరిగి పోకిరి వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడట. దీన్ని చూస్తుంటే రామ్ చరణ్ బాక్సాఫీసును షేక్ చేయడమే కాకుండా మన యువ కథానాయకుల కుర్చీలను కూడా షేక్ చేసినట్టు అనిపిస్తుంది కదా!


Click it and Unblock the Notifications











