‘మగధీర’ సినిమా చూసి కాలభైరవుడికి ప్రాణాలర్పించిన రామ్ చరణ్ అభిమాని!

By Sindhu

పునర్జన్మ కోసం ప్రాణం తీసుకున్నాడు కన్నాటకకు చెండిన ఓ కుర్రాడు. ఇంకా ఇంటర్ మీడియట్ దశలోనే వున్న ఈ విద్యార్ధి రామ్ చరణ్ కు వీరాభిమాని. చరణ్ మీద వున్న అభిమానంతో నోట్ పుస్తకాల్లో కాలభైరవుని చిత్రాలు నోట్ బుక్ లో గీయడమే కాకుండా, 'ల్ యూ రామ్ చరణ్.." అంటూ వేల సార్లు రక్తంతో రాసుకున్న చంద్రశేఖర్ అనే విధ్యార్థి. 'మగధీర" సినిమా చూసి ఇన్ స్పయిర్ అయ్యాడో ఏమోగానీ, పునర్జన్మ కోసం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అచ్చం 'మగధీర" సినిమాలోలా కాలభైరవుడికి పూజలు చేసి మరీ విషం పుచ్చుకున్నాడు చంద్రశేఖర్. తమ కుమారుడి ఆత్మహత్య చేసుకోవడం పై చంద్రశేఖర్ తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. చిన్న పిల్లలపై సినిమాలు విష ప్రభావం చూపుతున్నాయనడానికి ఇదొక నిదర్మనమని పలువురు విమర్శిస్తుంటే, సినిమాల్లో మంచీ, చెడూ రెండూ వుంటాయని, సినిమా తీస్తున్న వారిదే ఇలాంటి విషయాల్లో పూర్తి బాద్యత అనడం సరికాదని అభిమాన సంఘాలు చెబుతున్నాయి, కాగా ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్, 'మగధీర" సినిమాని ఏకంగా 30 సార్లు చూసేశాడట. కాలేజిలో అతని నడవడికలో మార్పును గమనించిన లెక్చరర్ లు కూడా అతన్ని సేవ్ చేయలేకపోయారు. ఇంతా జరుగుతున్నాతల్లిదండ్రులు చంద్రశేఖర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమేంటనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X