'మగధీర' అనువాదమా? పున: నిర్మాణమా?
తెలుగు సినిమా చరిత్రని తిరగరాసి, ఈరోజు అర్థ శతదినోత్సవం జరుపుకొంటోన్న, టాంప్ చేర్ లో వున్న 'మగధీర" ని తమిళం లోకి అనువదించాలా, రీమేక్ చేయాలా అనే విషయంపై ఇంకా నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మగధీర తమిళ ప్రజలకు ఎలా చూపించాలనేది ఇంకా నిర్ణయించలేదని అల్లు అరవింద్ చెప్పారు. అలాగే హిందీలో 'మగధీర"ని అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ తో రీమేక్ చేయనున్నరనే వార్తలపై కూడా ఆయన స్పందించారు.
గీతా ఆర్ట్స్ వర్గాలు ప్రస్తుతానికి ఆ ఆలోచనలు లేవని స్పష్టంచేశాయి. మగధీర భాలీవుడ్ కబుర్ల పై ఆ సంస్థ వర్గాలను సంప్రదిస్తే హిందీ చిత్ర పరిశ్రమను సైతం మగధీర ఆకట్టుకొంది. పలువురు పెద్ద నిర్మాతలు 'మగధీర" హిందీ రీమేక్ రైట్స్ కోసం అడుగుతున్న మాటా నిజమేనని, అయితే ఇంకా ఏదీ డిసైడ్ కాలేదని ఆయన చెప్పారు. రీమేక్ రైట్స్, చెన్నయ్ ప్రదర్శన వసూళ్లు లేకుండానే 'మగధీర' షేర్ అరవై కోట్ల మార్కునా దాటిపోవడం విశేషం. ఇక అన్నీ కలిపితే చివరకు ఎంతటి రికార్డుని సెట్ చేస్తుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











