మగధీర తన బెస్ట్ సినిమా కాదంటున్న రాజమౌళి
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా హీరోగా తీసిన మగధీర తన బెస్ట్ మూవీ కాదని అంటున్నారు దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాల్లో మగధీర ఒక్కటి అయనప్పటికీ దాన్ని తన బెస్ట్ ఫిల్మ్ గా అంగీకరించడానికి రాజమౌళి నిరాకరిస్తున్నారు. తన కెరీర్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి, సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న - ఈ రెండు బెస్ట్ మూవీలని కితాబు ఇచ్చుకుంటున్నాడు. అందుకు ఆయన కారణాలను కూడా చెబుతున్నారు. సడెన్ గా పెద్ద దర్శకుడు కావడానికి సింహాద్రి ఉపయోగపడిందని, మెయిన్ స్ట్రీమ్ హీరోను పెట్టకుండా ప్రయోగం చేసిన సినిమా మర్యాద రామన్న అని, అందువల్ల ఈ రెండు చిత్రాలే తన ఉత్తమ చిత్రాలని ఆయన వివరిస్తున్నారు. నిర్మాత అల్లు అర్జున్ తో ఏర్పడిన వివాదాలే రాజమౌళి మగధీరను వెనక్కి నెట్టడానికి కారణమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











