twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కర్ణాటకలో మగధీరకు చుక్కెదురు

    By Staff
    |

    కర్ణాటకలో 'మగధీర" సినిమా విడుదలను నిలిపేస్తూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షురాలు జయమాల తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని కన్నడ నిర్మాతలు విమర్శించారు. అందుకు బాధ్యత వహించి ఆమె రాజీనామా చేయాలంటూ కన్నడ సినిమా నిర్మాతలు మంగళవారం ఉదయం దర్నా చేశారు. ఈ సినిమా విడుదల ద్వారా కన్నడ సినిమాల విడుదలకు ఆటంకం కలిగి చాలా నష్టం వస్తోందటున్నారు. మగధీరపై చర్యలు తీసుకోకపోవడం వల్ల కన్నడ సినీవర్గానికి అన్యాయం జరుగుతోందని నిర్మాత మణిరత్నం ఆరోపించారు. నియమాల ప్రకారమే సినిమాను విడుదల చేయాలని కర్ణాటక నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి జో సైమన్ డిమాండ్ చేశారు. ఆంధ్రరాష్ట్రంలో విడుదలైన ఏడు వారాల తర్వాత తెలుగు చిత్రాలను కర్ణాటకలో విడుదల చేయాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కోశాధికారి సా.ర. గోవింద్ అన్నారు.

    పర భాషా చిత్రాలను విడుదల చేయడానికి ఆ చిత్రాల నిర్మాతలు కర్ణాటక వాణిజ్య చలనచిత్ర మండలిలో సభ్యులై వుండాలి, ఈ అనుమతితోనే పరభాషా చిత్రాలను విడుదల చేయాలి, ఈ నిబంధనలకు సినిమా థియేటర్ల ఓనర్లు, డిష్ట్రిబ్యూటర్లు సహకరించాలన్నారు. పరభాషా చిత్రాల హక్కులను రాష్ట్రంమంతా ఒకే సారి కొనాలని డిమాండ్ చేశారు. 'మగధీర" కర్ణాటక హక్కులని విజయ్ కుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఇతను కర్ణాటక వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు 'జల్సా" సినిమా కర్ణాటక హక్కులని విజయ్ కుమారే కొనుగోలు చేశారు. జల్సా మగధీర సినిమాలు నియమాలు ఉల్లంఘించి విడుదల చేశారని విమర్శలు రావడంతో వాణిజ్య మండలి నుండి విజయ్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఒక నెలలోపల తమ డిమాండ్ లను తీర్చకపోతే పోరాటం తీవ్రంగా వుంటుందని కన్నడ సినిమా నిర్మాతలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ ధర్నాలో కన్నడ నిర్మాతలు కె.సి.యన్. చంద్రశేఖర్, రాజేంద్ర సింగ్ బాబు, జె.జగదీష్, ఉమేష్, బసంతకుమార్ పాటిల్, రాము, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X