'పోకిరిని' అధిగమించిన 'మగధీర'
రామ్ చరణ్, యస్.యస్.రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సరికొత్త సంచలనం 'మగధీర'. అధ్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, రామ్ చరణ్ నటన, కాజల్ చార్మింగ్ బ్యూటీ ప్రధాన హైలెట్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తన జైతయాత్రను కొనసాగిస్తోంది. దీనికి తోడు పోయిన రెండు వారాల్లో వచ్చిన 'ఆంజనేయులు', 'మల్లన్న' చిత్రాలు ఆశించినంత విజయం సాధించక పోయేసరికి మగధీర కలెక్షన్లకు అడ్డే లేకుండా పోయింది. తొలి రెండు వారాల్లోనే 32 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మూడవ వారం కలెక్షన్లతో తెలుగు సినిమా ఆల్ టైమ్ రికార్డయిన 'పోకిరి' చిత్ర రికార్డును అధిగమించి సరికొత్త చరిత్రను సృష్టించడానికి దూసుకుపోతోంది.
ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం మగధీర చిత్రం మూడు వారాల్లో 48.8కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. దీనికి తోడు తాజాగా సినిమా థియేటర్ల సంఖ్యను కూడా పెంచడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం వుంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన ఈ చిత్రం ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











