టాలీవుడ్ హీరోలకి రామ్ చరణ్ సవాల్
మెగాస్టార్ 'చిరు త'నయుడిగా సినీరంగ ప్రవేశం చేసి తొలి సినిమాతో బాగా చేశాడు అనిపించుకున్న రామ్ చరణ్ తన రెండవ సినిమాతోటే బాక్సఫీసు ను షేక్ చేసి, టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి 'మగధీరు'డు అనిపించుకున్నాడు. ఇంత వరకూ 80 కోట్లు వసూలు చేసి 100 కోట్లు వసూలు చేసే దిశగా పరుగులు తీస్తున్నాడు. అంతే కాదండోయ్ తన రెండవ చిత్రంతోనే ఈ ఘనతను సాధించి టాలీవుడ్ స్టార్ హీరోలకు సవాల్ విసిరాడు. ఇదంతా నిశితంగా గమనిస్తున్న హీరోలు తమ చిత్రాలు తప్పక హిట్ అవ్వాలనే పట్టుదలతో పనిచేస్తున్నారట.
ముఖ్యంగా టాలీవుడ్ నెం.1 రేసులో ముందంజలో వున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా గమణిస్తున్నాడట. మగధీర సినిమాని చాలా సార్లు చూసి అందులో అంతగా ఆకట్టుకున్న విషయం ఏంటని సమీక్షిస్తున్నాడట. అంతే కాకుండా తన తర్వాతి చిత్రం తప్పకుండా విజయవంతం అవ్వాలనే పట్టుదలతో పనిచేస్తున్నాడట. కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోతో తిరిగి రీ-షూట్ చెయ్యమని ఒత్తిడి చేసి మరీ సరిదిద్దుతున్నాడట. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఏడాదిన్నర్రగా తన సినిమా ఏదీ విడుదల కాకపోయే సరికి కంగారు పడిపోతున్నాడట. ఎక్కడ తనని ప్రేక్షకులు మరచిపోతారోనని. అందుకే వరుసగా సినిమాలు చేస్తూ, తిరిగి పోకిరి వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడట. దీన్ని చూస్తుంటే రామ్ చరణ్ బాక్సఫీసు ను షేక్ చెయ్యడమే కాకుండా మన యువ కథానాయకులు కుర్చీలను కూడా షేక్ చేసినట్టు అనిపిస్తోంది కదూ!!!


Click it and Unblock the Notifications











