మగధీరకి మరో చిరు లింక్
రామ్ చరణ్ హీరో గా రాజ మౌళి రూపొందించుతున్న మగధీర చిత్రం మరో చిరు లింక్ తో ముందుకు రానుంది. చిరంజీవి సూపర్ హిట్ ఇంద్ర రిలీజ్ రోజైన జూలై 24న 'మగధీర' రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. సరిగ్గా సరిగ్గా రెండేళ్ల క్రితం బి.గోపాల్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన 'ఇంద్ర' చిత్రం చిరంజీవి కెరీర్ లోనే మంచి హిట్ నమోదు చేసింది. అలాగే 'మగధీర'లో రామ్ చరణ్ తో కలిసి బంగారు కోడి పెట్ట పాటలో చిరంజీవి స్టెప్స్ వేశారు. తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే సినిమాలో చూపించడంతో పాటు 'ఇంద్ర' రిలీజ్ రోజునే 'మగధీర' విడుదల చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుందనే అభిప్రాయంతో రాజమౌళి, అల్లు అరవింద్ లు ఉన్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా కాజల్, ప్రత్యేక పాత్రలో శ్రీహరి నటించారు.
రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది.రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె తన క్యారెక్టర్ గురించి చెబుతూ ఫస్టాఫ్ లో నేను ప్యాషన్ డిజైనర్ గా కనిపిస్తాను..సెకెండాఫ్ లో ఓ రాకుమార్తెగా అదరకొడతాను అని చెప్తోంది.
విజయేంద్ర ప్రసాద్ సమకూర్చిన మగధీర కథకు ఎం.రత్నం సంభాషణలు వ్రాసారు. సంగీతం: యం.యం.కీరవాణి, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, స్టైలింగ్: రమా రాజమౌళి, కళ: రవీందర్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్, ఛీఫ్ కోడెైరక్టర్: జె.వి.వి.సత్యనారాయణ, కో-డెైరక్టర్: పేటకోటి, ప్రొడక్షన్ కంట్రోలర్:డి.యోగానంద్, నిర్వహణ: బాబు, సహనిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.


Click it and Unblock the Notifications











