twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’ ఇంకా ఇంకా హెల్పు అవుతూనే వుంది...

    By Sindhu
    |

    దక్షినాది చలన చిత్ర రంగంలో నిస్పందేహంగా బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ ఎవరంటే కాజల్ అని చెప్పచ్చు. అదుకు నిదర్శనాలైనటువంటి ఆమె నటించిన 'మగధీర", 'ఆర్య2", తమిళంలో 'నాన్ మహాన్ అల్లా" సినిమా సక్సెస్ లే ఆమె క్రెడిట్. దాంతో ఆమె ఇండస్ట్రీలో ఆమె ఇమేజ్, క్రేజ్ ఒక్కసారిగా అమాంతగా పెరిగిపోయింది. ఒక సినిమా హిట్ అయితే అందులో నటించిన ఆర్టిస్టులకి మరికొన్ని సినిమాలు వస్తాయి.

    కొన్నాళ్ల క్రితం వచ్చిన 'మగధీర' సినిమా హీరోయిన్ కాజల్ కి అలాగే ఉపయోగపడింది. ఆ సినిమా సక్సెస్ తో తను స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. రెమ్యునేరేషన్ పెంచింది. అంతేకాదు, ఆ హిట్ కాజల్ కి ఇంకా హెల్ప్ అవుతూనే వుంది. ఆ సినిమా వల్లే తాజాగా తనకి హిందీలో ఓ అవకాశం వచ్చింది. తమిళంలో హిట్టయిన 'సింగం' సినిమాని దర్శకుడు రోహిత్ శెట్టి హీరో అజయ్ దేవగణ్ తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ ఎంపికకు 'మగధీర' సినిమా తోడయ్యిందట. దీని గురించి కాజల్ చెబుతూ 'రోహిత్ ఇటీవల 'మగధీర' చూసాడట. నా పెర్ ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయి, నన్ను కాంటాక్ట్ చేసారు. నాకు కూడా హిందీ ప్రాజక్టు నచ్చింది. దానికి తోడు డేట్స్ కూడా వున్నాయి. యాక్సప్ట్ చేసాను. ఆ విధంగా 'మగధీర' నాకు హిందీలో కూడా హెల్ప్ అయింది' అంటోంది.

    English summary
    She’s undoubtedly one of the biggest brands in South Indian cinema. Kajal Aggarwal, with films like Magadheera, 
 
 Aarya 2 and Naan Mahaan Alla to her credit, is the most sought after heroine here. Now, Bollywood director Rohit 
 
 Shetty has seen her recent work and decided to cast her in the remake of Singam, opposite Ajay Devgan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X