twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర' రిలీజ్ డేట్ ఛేంజ్!

    By Staff
    |

    మగధీర చిత్రం ముందుగా ప్రకటించినట్లుగా జూలై 24న కాకుండా జూలై 29న రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బోగవల్లి ప్రసాద్ కన్ఫర్మ్ చేస్తూ వివరించారు. కీరవాణి,రాజమౌళి ఇద్దరూ అమెరికా లో ఉండటం, రీరికార్డింగ్ వర్క్ బ్యాలన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక రామ్ చరణ్, కాజోల్ కాంబినేషన్లో రెడీ అవుతున్న ఈ చిత్రం అభిమానులునే కాక అందరినీ అలరించే అవకాశముందని అంటున్నారు.

    అలాగే చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని బంగారు కోడి పెట్ట పాట ను ఈ చిత్రంలో రీమిక్స్ చేసారు. అంతేగాక చిరంజీవి సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు. ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X