For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర ఫోస్ట్ ఫోన్ ఎందుకంటే...

    By Staff
    |

    Ram Charan Teja
    మగధీర చిత్రం విడుదల మళ్ళీ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ మూడవ వారంలో రిలీజవుతుందని ప్లాన్ చేసిన ఈ చిత్రం జూలై చివర వారంకి పోస్ట్ ఫోన్ చేసారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవటం వల్ల ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక రాజమౌళి..రామచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంకి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు.ఈ చిత్రం ఆడియో జూన్ రెండవ వారంలో రిలీజవుతాయి. అలాగే ఆడియో రిలీజుకు, చిత్రం విడుదల కి తగినంత గ్యాప్ ఉండాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ వర్క్ నడుస్తోంది.

    ఈ చిత్రలో చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు.

    అలాగే మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. బడ్జెట్ కూడా దాదాపు ముఫ్ఫై ఎనిమిది కోట్లు దాకా అయిందని అంతటా వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరో ముఖ్య విశేషం ఏమిటంటే 'బంగారు కోడిపెట్ట...' రీమిక్స్‌ గీతంలో చిరంజీవి, చరణ్‌ కలిసి నృత్యం చేశారు. 'మగధీర'లో శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కథ: వి.విజయేంద్రప్రసాద్‌, స్త్టెలింగ్‌: రమా రాజమౌళి, సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X