రామ్ చరణ్ కొత్త ఫీట్లు
మగధీర ఘనవిజయంలో రామ్ చరణ్ చేసిన యాక్షన్ స్టంట్స్, డాన్సులు ముఖ్యపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. యాక్షన్ సన్నివేశాల్లో, డాన్సుల్లో తండ్రిని మించిన తనయుడనిపించుకున్న చెర్రీ తాజాగా "స్కై-డైవింగ్" లో శిక్షణ తీసుకోబోతున్నట్టు సమాచారం. తన తొలి చిత్రం చిరుత, మలిచిత్రం మగధీర ల్లో అధ్బుతమైన స్టంట్స్ తో అలరించిన రామ్ చరణ్ "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం ఈ శిక్షణ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఐతే సున్నితమైన కథాంశాలతో, ఫ్యామిలీ సినిమాలు రూపొందించే భాస్కర్ యాక్షన్ ఇమేజ్ వున్న చెర్రీ ని ఎలా చూపించబోతున్నాడనేది ఆశక్తికరాంశం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించబోతున్న ఈ చిత్రంలో "హా..హా..హాసిని" జెనీలియ కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెల్లనుంది.
ramcharan magadheera chiranjeevi geneelia kajal naga babu bhaskar bommarilli parugu ssrajamouli రామ్ చరణ్ మగధీర భాస్కర్ జెనీలియ నాగబాబు బొమ్మరిల్లు చిరంజీవి కాజల్


Click it and Unblock the Notifications