twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర 750 రోజులకు చేరువలో మరో సరికొత్త రికార్డ్..!

    By Sindhu
    |

    హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ర్టీ ఏదైనా సినిమా పట్టుమని పదిరోజులు థియేటర్లలో ఆడిందంటే.. పెద్ద వండరే. ఎంత పెద్ద హీరో సినిమా అయినా... మహా అయితే 30 రోజులకే పరిమితమవుతోంది. ఒకవేళ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మ్యాగ్జిమమ్ 50 డేస్. అంతకుమించి ఆడడం గగనమే. అలా ఉంది ప్రస్తుత సినిమా ఇండస్ర్టీ పరిస్థితి. ఐతే ఒక తెలుగు సినిమా ఏడు వందల 45 రోజులుగా ఒక థియేటర్ లో దిగ్విజయంగా రన్ అవుతోంది. ఏంటా సినిమా.

    ఒకప్పుడు సినిమాలు హండ్రెడ్ డేస్ 250 డేస్, 500 డేస్ జరుపుకునేవి. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీని కష్టాలు వెంటాడుతున్నాయి. కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్టుగా... సినీ పరిశ్రమలో ట్రాజెడీకి సైతం ఎన్నో కారణాలున్నాయి. సినిమా రిలీజ్‌ అయిన మరుక్షణమే పైరసీ సీడీలు విచ్చలవిడిగా సర్క్యులేట్‌ అవుతుండడంతో నిర్మాత కుదేలవుతున్నారు. దీనికితోడు పసలేని కథలు, పెద్ద హీరోలు సినిమాలు తగ్గించుకోవడం వంటి రీజన్స్‌ వెండి తెరకు వెలుగులను దూరం చేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ కర్నూలులో ఓ చిత్రం ఏడువందల 45 రోజులుగా ఏకధాటిగా ప్రదర్శింపబడుతోంది. టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించిన ఆ చిత్రమే మగధీర.

    సూపర్ హిట్ లు లేక టాలీవుడ్ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టైంలో..మగధీర ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ పతాకంపై..సూపర్ హిట్ డైరెక్టర్ రాజమౌళి తీసిన ఈ సినిమా రెండేళ్ల క్రితం రాష్ట్రమంతటా విడుదలైంది. రామ్‌ చరణ్ , కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది.
    కథ, కథనం, గ్రాఫిక్స్, స్వరవాణి కీరవాణి మ్యూజిక్ ..వీటన్నిటినీ మించి...జక్కన్నమేకింగ్..మగధీరను తెలుగు తెరపై వెలిగేలా చేశాయి. ఇక చెర్రీ, కాజల్ పోటాపోటీ నటన ప్రేక్షకులను మైమరపింపచేసింది.

    అన్ని సినిమాల మాదిరే మగధీరపైనా పైరసీ భూతం దాడి చేసింది. అయినప్పటికీ... తెలుగు ప్రేక్షకాభిమానాలతో రెండు సంవత్సరాలుగా ..కర్నూలు లక్ష్మీ థియేటర్ లో నిరంతరాయంగా ప్రదర్శింపబడుతోందీ మగధీర చిత్రం. త్వరలో 750 రోజులుకు చేరువవుతోంది. అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందించిన.. ఈ సినిమాని థియేటర్ లోనే చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని థియేటర్ యాజమాన్యం చెప్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించిన మగధీర డీడీఎల్ రికార్డును అందుకుంటుందో లేదోగానీ...మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందనడానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు...

    English summary
    Magadheera' has recently completed its one year run in Kurnool city. Now, the local Ram Charan fans are planning to make the movie to run for the highest number of days by running it for 750 days. So, far no Telugu movie has run for this long. Following are the movies that had the previous and the current all time long run records.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X