'మగధీర' కథ కిరికిరి
రామ్ చరణ్ హీరోగా రూపొందిన "మగధీర" కథ తనదేనంటూ చారి అనే రచయిత క్లెయిమ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సినిమా అయిన దీనికి నిర్మాత అల్లు అరవింద్. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తాను రాసిన చందేరి నవలకు ఇది మక్కికి మక్కి కాపీ అని, తన నవల ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్ గా 2002 లో ప్రచురితమైందని, దానికి పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చారి ఆస్ట్రేలియా నుంచి పంపిన ఇ-మెయిల్ లో పేర్కొన్నారు.
ఈ ప్రేమగాధ మధ్యప్రదేశ్ చందేరిలో నాలు వందల ఏళ్ళ క్రితం నిజంగా జరిగిందని, అప్పుడు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్న జంట ఇప్పుడు మళ్ళీ పుట్టి మళ్ళీ కలుసుకుని ప్రేమను సఫలం చేసుకుంటారని చారి చెప్పారు. తన నవలలో ఇదే ఉందని, దీనిని కాపీ కొట్టిన విషయాన్ని నిర్మాత అరవింద్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఆయన తన మెయిల్ లో పేర్కొన్నారు. ఎస్పీ చారి అనే పేరుతో తాను ఈ నవల రాశానని, అది ఇటీవల పుస్తక రూపంలో కూడా వచ్చిందని తెలియజేశారు.
ఇది తన కథేనని అభ్యంతరం తెలియజేసినా నిర్మాత పట్టించుకోలేదని, సినిమా పూర్తి చేశారని ఆయన అన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలియజేశారు. ఆస్ట్ర్తేలియాలో ఉంటున్నానని చెప్పిన చారి ఇచ్చిన చిరునామా ఇది.
5, Belworth Avenue,
Harmony Drive,Tarneit,
Victoria-3029,
Melbourne,
Australia.


Click it and Unblock the Notifications











