»   » అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రాణం తీసిన 'మగధీర'?

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రాణం తీసిన 'మగధీర'?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ లోని ప్రెండ్స్ కాలనీలోని పప్పుల గూడ ఉండే సత్తెన్న అనే అసెస్టెంట్ డైరక్టర్ నిన్న(శుక్రవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ కి చెందిన ఈ కుర్రాడు సుమంత్ నటించిన 'చిన్నోడు' వంటి చిత్రాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసాడు. అతని ఆత్మహత్యకు కారణం అప్పులే అని రాసినప్పటికీ, ఆ అఫ్పులకు కారణంగా 'మగధీర' కథ అని ప్రస్తావించాడని పోలీసులు చెప్తున్నారు. తను 'మగధీర' కథను రాసి నిర్మాత దగ్గరకి వెళ్ళి విన్పించి స్క్రిప్టు జెరాక్స్ కాపీ ఇచ్చానని, ఆ తర్వాత అదే కథతో సినిమా చేసారని సూసైడ్ నోట్ లో ప్రస్దావించాడు. అలాగే ఈ వివాదంపై అతను కోర్టుకు సైతం వెళ్ళాడని, న్యాయం జరగకపోవటం, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయని రాసాడు. ఆ కథను రాసినందుకు తాను సిగ్గుపడుతున్నానని, ఈ విషయంలో తనకు రాజమౌళి పూర్తిగా అన్యాయం చేశారని సత్యన్న పేర్కొనడం గమనార్హం. ఇక సత్తెన్నకు సినిమా ఇండస్ట్రీలో బాగానే పరిచయాలున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఎస్పీచారి అనే రచయిత తన చండేరి అనే నవలను కాపీ కొట్టి మగధీర చిత్రం రూపొందించారని పోరాడుతున్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu