రికార్డు సృష్టించిన ‘మగధీర’ని ఇన్సల్ట్ చేయడమా...
ఏదైన ఒక సినిమా, ఒక పాత్ర హిట్ అయితే దాన్ని పేరడీగా మలచి కామెడీ సష్టించడం మన దర్శకులకు అలవాటే. పెదరాయుడు గెటప్ ను ఎంఎస్. నారాయణ వేసినా..బాషాగా అలీ కనిపించినా..అపరిచితుడుగా వేణు మాధవ్ చక్కని హాస్యాన్ని పంచినా..సునీల్ చిరంజీవి స్టెప్పులు వేసినా ..పేరడిగా ఎవరు ఏగెటప్ వేసినా అవి మంచి హాస్యాన్ని పంచాడానికే..
అయితే పంచాక్షరి సినిమాలో మగధీర పేరడీని బ్రహ్మానందం, అనుష్క పై తెరకెక్కించారు. కాలభైరవగా బ్రహ్మానందం, 'మగధీర" ఇన్సల్ట్ చేయడం మాటా అలా ఉంచితే..చిత్రానికి పెద్ద మైనస్ గా నిలిచారు. ఏదో పెట్టాలి అన్నట్లుగా ఈ రీల్ చేశారే గానీ చిత్రంలో హాస్యాన్ని పండిచలేక, ప్రేక్షకుల్ని నవ్వించలేక పోయింది. సొట్టబుగ్గల స్వామిగా అలీ పాత్ర అంతంతమాత్రంగానే పడింది. సాధారణంగా పేరడీలు హిట్ అవుతాయి. నవ్వులు పూయిస్తాయి. కానీ ఈ 'మగధీర" పేరడీ ఫైయిల్ అయింది. విసుగుపుట్టించింది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.


Click it and Unblock the Notifications











