మగధీరకి మరో రెండు రికార్డులా..!?
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా రాజమౌళి రూపొందించిన, బాక్సాఫీస్ బద్దలు చేసిన చిత్రం 'మగధీర" మరో అరుదైన రెండు రికార్డులను సొంతం చేసుకుంది..ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం సినిమా సగం విజయానికి కారణం అయిందనే విషయం అందరికీ తెలిసిందే..ఇప్పుడు కీరవాణి ఈ చిత్రం కోసం రూపొందించిన 'పంచదార బొమ్మా.." పాట మరో రికార్డును సృష్టించింది..మొబైల్ ఫోన్స్ లో కాలర్ ట్యూన్ గా ఎక్కువ డౌన్ లోడ్ అయిన పాటగా ఈ పాట రికార్డును సొంతం చేసుకుంది..సుమారు 3కోట్ల రూపాయలు డౌన్ లోడ్ రూపాంలోనే ఈ పాట వసూలు చేసిందని సమాచారమ్..తొలిసారిగా టాలీవుడ్ లో ఇటువంటి రికార్డు నమోదు అవ్వడం ఇదే ప్రథమసారి..
మరో అరుదైన రికార్డు ఏమిటంటే కర్నూలులో ఓ థియేటర్ లో ఈ చిత్రం జూలై 31తో సంవత్సరం పూర్తి చేసుకుని యేడాది ఆడిన చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకోనుంది..అయితే ఈ రికార్డు ఇప్పటికే చాలా చిత్రాలు సృష్టించిన విషయం తెలిసిందే..అదే తరహాలో ఈ చిత్రం గత చిత్రాల రికార్డులు నెలకొల్పిన అత్యధిక రోజుల రికార్డును కూడా ఇదే థియేటర్ లో పూర్తి చేయనుందనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











