అధ్బుతమైన గ్రాఫిక్స్, కత్తి యుద్దాలు 'మగధీరుడు ఒక్కడే' కే సాధ్యం
అద్భుతమైన గ్రాఫిక్స్, కత్తియుద్ధాలు, గుర్రాల పరుగులు, భూమిలో దాగి వున్న వీరులు బయటకు రావడం, ఆకాశ మార్గంలో వీరులు సాగిపోతూ పెద్ద పెద్ద భవంతులను అవలీలగా దాటడం వంటి సన్నివేశాలను చూడాలంటే 'మగధీరుడు ఒక్కడే' లోనే సాధ్యం అంటున్నారు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెలుగులో తాము అందిస్తున్న 'మగధీరుడు ఒక్కడే' చిత్రం తమ సంస్థ ఇమేజ్‌ని పెంచుతుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వాసు తెలిపారు. హాలీవుడ్‌లో రూపొందిన 'ద వారియర్స్ వే' చిత్రానికి అనువాద రూపమైన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ "హాలీవుడ్‌లో 'ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన నిర్మాతలు తీసిన చిత్రం 'ద వారియర్స్ వే'. పూర్తి స్థాయి మాస్, మసాలాలతో కూడిన యాక్షన్ సినిమా. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యత ఉంటుంది. కథ విషయానికొస్తే ఆసియా ఖండంలో అద్భుతమైన యోధునిగా పేరు తెచ్చుకున్న 'జాంగ్' అనే వీరుడు అనివార్య పరిస్థితుల్లో అమెరికాలో తలదాచుకోవాల్సి వస్తుంది. అక్కడ అతనికి ఓ తాగుబోతు, సర్కస్‌లో కత్తులు విసిరే వ్యక్తి పరిచయమవుతారు. వారి నుంచి జాంగ్‌కు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. అవి అల్లాటప్పా రహస్యాలు కావు.అతి శక్తివంతమైనవి. వాటి ద్వారా జాంగ్ ఏమి చేశాడు? తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది చిత్ర కథాంశం. కొరియన్ డైరక్టర్ సింగ్ మూలీ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. నిర్మాణానంతర కార్యక్రమాలకే దాదాపు ఏడాది పట్టింది.అది మన రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











