గ్యాంగ్ లీడర్ నిర్మాతే ఎమ్.ఎస్ రాజు తో...
సంక్రాంతి రాజు గా పేరు పడ్డ ఎమ్.ఎస్ రాజు గతంలో ఒక్కడు,నువ్వొస్తానంటే నే వద్దంటానా,వర్షం వంటి ఎన్నో మెగా హిట్ ఫిల్మ్ ని నిర్మించారు.అయితే ఆ తర్వాత ఆయన వరసగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవటంతో వెనకపడ్డారు.ఇప్పుడు తన కుమారుడుని హీరోగా పరిచయం చేస్తూ తూనీగా తూనీగాచిత్రం డైరక్ట్ చేస్తున్నారు.చాలా లో ప్రొఫైల్ లో ఈ చిత్రం డిటేల్స్ ని ఉంచుతున్న ఆయన ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొడ్తారని వినపడుతోంది.ఇక ఈ చిత్రాన్ని మాగంటి బాబు కుమారుడు రామ్ చంద్రన్ నిర్మిస్తున్నారు.పద్మని ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాగంటి కుటుంబం గతంలో గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించారు.ఇక ఎమ్.ఎస్ రాజు చిత్రం లోగో ఆవిష్కరణ జరగనుంది.అలాగే ఎమ్ ఎస్ రాజు కి ఇది దర్శకుడుగా రెండవ చిత్రం.గతంలో కన్నడంలో సూపర్ డూపర్ చిత్రం ముంగార మళెచిత్రాన్ని తెలుగులో స్వీయ నిర్మానంలోవానపేరుతో దర్శకత్వం వహించారు.అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.మరి ఈ ద్వితీయ చిత్రం హిట్టై ఆయనకు దర్శకుడుగానూ,ఆయన కుమారుడుకి హీరోగానూ నిలబెట్టాలని కోరుకుందాం.తూనీగ తూనీగ టైటిల్ ఆయన సూపర్ హిట్ చిత్రం మనసంతా నువ్వే లోని ఓ పాట చరణం.


Click it and Unblock the Notifications











