రీషూట్ లో మగధీర?

By Staff

Ramcharan
మగధీర చిత్రంలో ఓ పాటలో రామ్ చరణ్ తేజ స్టెప్స్ సరిగా లేవని రాజమౌళి రీషూట్ పెట్టాడని సమాచారం. రషెష్ పూర్తిగా వేసి చూసుకున్న రాజమౌళి ఆ పాట దగ్గర మాత్రం ఆగి రెండు మూడు సార్లు పరిశీలించి,ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. టైటిల్ సాంగ్ లోనే ఈ పొరపాటు జరిగినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో ఈ చిత్రం విడుదల వచ్చే నెల ఐదుకు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అల్లుఅరవింద్ అధికారికంగా ఈ నెల ఇరవై తొమ్మిది రిలీజు చేస్తామని చెప్పటంతో అలా జరగదని కొందరంటున్నారు. ఇక ఈ పాట రీషూట్ కూడా హైదరాబాద్ లోనే అంతకు ముందు వేసిన సెట్ లోనే జరగనుందని తెలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడనుండటంతో ఈ చిత్రం గురించిన కబుర్లే అంతటా వినిపిస్తున్నాయి. ఇక శిల్పం చెక్కినట్లు జాగ్రత్తగా సినిమాను తీర్చిదిద్దుతాడని అభినవ జక్కన్న అని పేరుతెచ్చుకున్న రాజమౌళి ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఇస్తాడని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X