twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ వెండితెరపై హంగామా.. ఒకేరోజు పది సినిమాలు రిలీజ్.. ఆ చిత్రాలు ఇవే..

    By Rajababu
    |

    Recommended Video

    టాలీవుడ్ హంగామా.. ఒకేరోజు పది సినిమాలు రిలీజ్

    సినీ ప్రేక్షకులకు, అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండుగే పండుగ. ఎందుకంటే కొత్త సినిమాలు వెండితెరను తాకుతాయి. సాధారణంగా ప్రతీ శుక్రవారం ఎక్కువలో ఎక్కువ నాలుగు సినిమాలు విడుదలైతే అదే పెద్ద వార్త. కానీ టాలీవుడ్‌లో గతవారం, ప్రస్తుత వారం భిన్నమైన స్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే గతవారం దాదాపు 10 చిత్రాలు, ఈ వారం (శుక్రవారం, నవంబర్ 24) కూడా మరో పది చిత్రాలు తెలుగు తెరపై సందడి చేయనున్నాయి. నిజానికి 11 చిత్రాలు విడుదల కావాల్సి ఉండేది. అయితే లచ్చి సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ పది చిత్రాల వివరాలు ఇవిగో..

    బాలకృష్ణుడు

    బాలకృష్ణుడు

    పవన్ మల్లెల దర్శకత్వంలో ఎస్వీఎంపి బ్యానర్‌లో నారా రోహిత్ హీరోగా బాలకృష్ణుడు చిత్రం తెరకెక్కుతున్నది. నారా రోహిత్ సరసన రెజీనా కసండ్రా నటిస్తున్నది. ఈ చిత్రానికి మెలోడి కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్‌తో కనిపించడం విశేషం.

    మెంటల్ మదిలో

    మెంటల్ మదిలో

    పెళ్లిచూపులు తర్వాత నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం మెంటల్ మదిలో. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, కొత్త తారలు నివేదా పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా నటించారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొన్నది.

    దేవి శ్రీ ప్రసాద్

    దేవి శ్రీ ప్రసాద్

    ఆర్వో క్రియేష‌న్స్, య‌శ్వంత్ మూవీస్ సంయుక్తంగా భూపాల్, మ‌నోజ్ నంద‌న్‌,పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డీ వెంక‌టేష్‌, ఆర్‌వీ రాజు, ఆక్రోష్ నిర్మించారు. ‘దేవి శ్రీ ప్రసాద్' మూవీలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్, బిగ్‌బాస్ కన్టెస్టెంట్ ధ‌న‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది.

    బేబి

    బేబి

    సీనియర్‌ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్‌ భారతీరాజా కథానాయకుడిగా, షిరాగార్గ్‌, అంజలిరావు కథానాయికలుగా, బేబి శాతన్య, బేబి శ్రీవర్షిని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం బేబి. తమిళంలో డీ సురేష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి పాలపర్తి శివకుమార్‌ శర్మ సమర్పణలో సాయిప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై బివీఎన్‌ పవన్‌కుమార్‌, కొలవెన్ను ఆంజనేయప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సతీష్‌, హరీష్‌ సంగీతాన్ని సమకూర్చారు.

    హాయ్ పిల్లగాడ

    హాయ్ పిల్లగాడ

    దుల్కర్‌ సల్మాన్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం కలి. ఈ చిత్రం మలయాళం, తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్లగాడా! అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఓకే బంగారం సినిమాతో దుల్కర్‌ సల్మాన్‌, ఫిదాతో భానుమతిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    జంధ్యాల రాసిన ప్రేమకథ

    జంధ్యాల రాసిన ప్రేమకథ

    కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్‌ రెడ్డి, అశోక్ సిరియాల నిర్మాతలుగా కృష్ణవర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జంధ్యాల రాసిన ప్రేమకథ'. శేఖర్‌, దిలీప్‌, శ్రీలక్ష్మీ, గాయత్రి గుప్త తదితరులు నటించారు. ప్రముఖ దర్శకులు జంధ్యాల రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట' చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    రాముడిలా సీతా ఎవరుంటారు బాబు

    రాముడిలా సీతా ఎవరుంటారు బాబు

    క్రైం,రొమాన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం రాముడిలా సీతా ఎవరుంటారు బాబు. ప్రశాంత్ తాత, ఇషితా, లలిత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కే వెంకటేష్ దర్శకత్వం వహించారు.

    జూన్ 1: 43

    జూన్ 1: 43

    ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం `జూన్ 1:43`. శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చారు. వేణు, సాయి, బ‌న్ను, కాశీవిశ్వ‌నాథ్‌, మ‌ధుమ‌ణి, తోట‌ప‌ల్లి మ‌ధు,అరుణ్, కేధార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టించారు.

    నెపోలియన్

    నెపోలియన్

    ఆచార్య క్రియేషన్స్‌, ఆనంద్‌ రవి కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘నెపోలియన్‌'. ఆనంద్‌ రవి హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోమ‌లి, ర‌వివ‌ర్మ‌, కేదార్ శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, గురురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత.

    జూలీ 2

    జూలీ 2

    అందాల తార రాయ్ లక్ష్మీ నటించిన తాజా హిందీ చిత్రం జూలీ. ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ ప్రముఖుడు పహ్లాజ్ నిహ్లాని సమర్పించారు. 80, 90వ దశకంలో ప్రముఖ సినీ తారగా వెలుగొందిన ఓ నటి జీవిత కథా ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ప్రముఖ నటి నగ్మా జీవిత కథ అనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

    English summary
    A Magic moments on the Tollywood's silverscreen. Nearly 10 movies are set release on Telugu Film industry. Balakrishnudu, Metal Madhilo, Devi Sri Prasad are in the list. These releases created a new buzz in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X