శర్వానంద్ మహాసముద్రం కూడా సిద్ధమైంది.. కొలవలేనంత ప్రేమతో..
టాలెంటెడ్ యువ శర్వానంద్ గ్యాప్ లేకుండా ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న శర్వానంద్ జయాపజయాలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని మరి మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
సినిమాలు ప్లాప్ అయిన కూడా పెద్దగా మార్కెట్ పై ఎఫెక్ట్ పడటం లేదు. అలా మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో శ్రీకారం సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. అలాగే అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా రిలీజ్ డేట్ లీక్ అయ్యింది.సినిమాలో సిద్దార్థ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

సీరియస్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కథను మొదట పలువురు హీరోలు చేయడానికి వెనుకడుగు వేశారు. ఇక శర్వానంద్ ఒక్కడే రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. రేపు అఫీషియల్ గా ఉదయం 9గంటలకు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక అందిన సమాచారం ప్రకారం సినిమాను ఆగస్ట్ 19న రిలీజ్ చేయనున్నారు.
పుష్ప సినిమా ఆగస్టు 13న వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎఫ్3 సినిమా ఆగస్టు 27న రానుంది. వీటి మధ్యలోనే వచ్చి హిట్ కొట్టాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు. మరి సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











