మహా శివరాత్రి స్పెషల్: భారీ రేంజ్లో ప్రభాస్ కన్నప్ప నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే!
టాలీవుడ్లో మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు దీన్ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో విజువల్ వండర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. మరి ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉంది? సినీ ప్రియులు, అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. మహా శివ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తిగా ఫారెన్‌లోనే తెరకెక్కుతోంది. న్యూజిలాండ్‌లోనే దీన్ని చిత్రీకరిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటోంది. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాను రూపొందిస్తున్నారు.

భారీ తారాగాణంతో సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - స్టార్ హీరోయిన్ నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని ఇప్పటికే బయట టాక్ గట్టిగా వినిపిస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, కోలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్.శరత్‌కుమార్, కామెడీ కింగ్ బ్రహ్మానందం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో మోహన్‌బాబుతో పాటు మంచు విష్ణు కొడుకు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే మంచు విష్ణు కొడుకు వెండితెరకు పరిచయం కానున్నాడు. ప్రముఖ సంగీత దర్శకులు స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్నప్ప సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా చెప్పినట్టే చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా కనిపించి అలరించారు.
ఓ భారీ జలపాతం క్రింద బాణం, విల్లును ఎక్కుపెట్టినట్లుగా వారియర్‌గా మాసివ్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు పోస్టర్ బాగుందని, విజువల్ వండర్ అదిరిందని చెబుతున్నారు.సినిమాపై అంచనాలను పెంచుతోందని అంటున్నారు. అదే సమయంలో మరి కొంతమంది మిక్స్డ్ రివ్యూస్ కూడా పెడుతున్నారు.
శివరాత్రి రోజు ప్రభాస్ లుక్ రివీల్ చేస్తారనుకుంటే మీది ఇచ్చారంటే? బాహుబలిలో ప్రభాస్ లుక్‌ను కాపీ చేశారా? మీరెందుకొచ్చారన్నా? అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాదే దసరా బరిలో దిగే అవకాశముందని తెలుస్తోంది. చూడాలి మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న మంచు ఫ్యామిలీకి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో..


Click it and Unblock the Notifications











