ఆర్.ఆర్.మూవీ మేకర్స్ 3డి చిత్రం డిటేల్స్
బిజినెస్ మ్యాన్, పూలరంగడులతో నెంబర్ వన్ స్ధానంలో నిలబడ్డ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు తమ తదుపరి ప్రయత్నంగా ఓ 3డి చిత్రం చేస్తున్నారు. అయితే అది స్టైయిట్ చిత్రం కాదు. హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. ఆ చిత్రం వివరాల్లోకి వెళితే..వాల్ట్ డిస్నీ, యూ టీవీ, ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంయుక్తంగా అందిస్తున్న 'జాన్ కార్టర్' తెలుగులో 'మహావీరుడు'గా వస్తోంది.
డా. వెంకట్ నిర్మాత. ఈ చిత్రం గురించి కో-ప్రొడ్యూసర్ వి. సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, ''వరుసగా కిక్, డాన్ శీను, మిరపకారు, ప్రేమకావాలి, బిజినెస్‌మేన్, పూలరంగడు వంటి ఆరు సూపర్‌హిట్ చిత్రాల్ని అందించిన మా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మహావీరుడు చిత్రాన్ని మార్చి 9న 3డిలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. తప్పకుండా మా బ్యానర్‌కు కంటిన్యూస్‌గా ఏడవ సూపర్‌హిట్ చిత్రం అవుతుంది. 5 సంవత్సరాలపాటు అంతులేని ఖర్చుతో, అద్భుతమైన సాంకేతిక విలువలతో నిర్మించిన 'మహావీరుడు అవతార్, 2012 చిత్రాల స్ధాయిలో అఖండ విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది'' అన్నారు. అస్కార్ అవార్డ్ విన్నర్ ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాత డా. వెంకట్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











